Breaking News

భార్యను తుపాకీతో బెదిరించిన భర్త!

Published on Sun, 12/21/2025 - 12:00

అనంతపురం: నగరంలో జిమ్‌ నిర్వాహకుడు రాజశేఖర్‌రెడ్డి వద్ద ‘గన్‌’ లభించడం కలకలంరేపింది. నగరంలోని విద్యుత్‌ నగర్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి భార్య మనుషాను గన్‌తో బెదిరించిన విషయం తెలిసిందే. దంపతుల మధ్య కొన్నిరోజులుగా మనస్పర్థలున్నట్లు ఈనెల 11న నగరంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రాజశేఖర్‌రెడ్డి నుంచి పోలీసులు గన్‌ స్వా«దీనం చేసుకున్నారు. విచారణలో అతడు మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో గన్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఇద్దరు సీఐలతో రెండు దర్యాప్తు బృందాలు గ్వాలియర్‌కు వెళ్లి ఆయుధాల తయారీదారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయినట్లు సమాచారం. 

పట్టుబడిన ఇద్దరిని ఓ పోలీసు బృందం అనంతపురం తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాజశేఖర్‌ రెడ్డికి అనంతపురం నగరంలో సహకారం అందించిన వారిపైనా పోలీసులు దృష్టి పెట్టారు. అనంతపురం నగరానికి చెందిన ఇద్దరిని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి అక్రమ ఆయుధాలు అనంతపురంలో ఎంత మంది వద్ద ఉన్నాయనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. నగరానికి చెందిన వ్యక్తులకు అక్రమ ఆయుధాలు సరఫరా చేసే ముఠాకు సంబంధాలు ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి అక్రమ ఆయుధాలు ఇంకా ఎంత మంది వద్ద ఉన్నాయనే భయం వెంటాడుతోంది. జిమ్‌ నిర్వాహకుడు అయిన రాజశేఖర్‌ రెడ్డికి ఇంకా ఎంత మందితో పరిచయాలు ఉన్నాయనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)