Breaking News

నీ​కు తెలిసి కూడా నా లవర్‌ని ఎలా ప్రేమిస్తున్నావు..!

Published on Tue, 08/26/2025 - 11:35

అనంతపురం: ‘నువ్వే మా ప్రేమకు అడ్డు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం. నువ్వు చనిపోవాల్సిందే’ అంటూ ఓ యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేమికులు ప్రేరేపించిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన పూజారి స్వాతి (21) అనంతపురంలోని నలంద డిగ్రీ కళాశాలలో యూజీ మూడో సంవత్సరం చదువుతోంది. 

ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు దీపు రక్త పరీక్ష కేంద్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. అక్కడ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అరుణ్‌ కుమార్‌, మరో టెక్నీషియన్‌ అయిన యువతితో స్వాతి స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో అరుణ్‌కుమార్‌, స్వాతి ప్రేమలో పడ్డారు. విషయం తెలుసుకున్న సదరు యువతి సోమవారం ఉదయం స్వాతికి ఫోన్‌ చేసి మందలించింది. ‘నా ప్రియుడిని ఎలా ప్రేమిస్తున్నావు.. మేమిద్దరమూ ముందు నుంచి ప్రేమలో ఉన్నాం. నీవు అడ్డు వస్తున్నావు. ఈ విషయం ల్యాబ్‌లో, మీ హాస్టల్‌లో అందరికీ చెబుతాను’ అని బెదిరించింది. అదే ధోరణిలో అరుణ్‌కుమార్‌ కూడా ఆ యువతికి వత్తాసు పలుకుతూ స్వాతిని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన స్వాతి... సోమవారం ఉదయం 7.30 గంటలకు తాను ఉంటున్న బాలాజీ లేడీస్‌ హాస్టల్‌లో గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వాతి తండ్రి పూజారి నాగభూషణం ఫిర్యాదు మేరకు అనంతపురం టూ టౌన్‌ సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)