Breaking News

కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి

Published on Tue, 07/14/2026 - 11:06

అనంతపురం సెంట్రల్‌: అనంతపురంలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన కుమారుడితో విసిగి వేజారిన ఓ తల్లి కత్తెరతో పొడిచి చంపింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని మొదటిరోడ్డు శివాలయం సమీపంలో చోటు చేసుకుంది. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీత, బ్రహ్మయ్య ఆచారి దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. 

కొంతకాలంగా మొదటిరోడ్డు శివాలయం సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమారుడు సురేంద్రచారి(28) ఉన్నాడు. వీరి కుటుంబం కార్పెంటర్‌ వృత్తిపై ఆధారపడి జీవిస్తోంది. అయితే.. అవివాహితుడైన సురేంద్రచారి కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. పనికి వెళ్లకుండా మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ  నిత్యం తల్లిదండ్రులపై దాడి చేస్తూ వేధించేవాడు. సోమవారం సాయంత్రం తల్లి సునీతతో గొడవ పెట్టుకున్నాడు. 

పలు దఫాలు దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత అక్కడే ఉన్న దుస్తులు కత్తిరించే కత్తెరతో పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌చార్జ్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శరత్‌చంద్ర,  సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)