Breaking News

విషాదం: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన 19 ఏళ్ల యువకుడు, చూస్తుండగానే...

Published on Tue, 03/07/2023 - 18:29

సాక్షి, అనంతపురం: నిర్దిష్ట కారణాలేంటో తెలియదుగానీ ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా నిండా పాతికేళ్లు కూడా లేని యువత హార్ట్‌ అటాక్‌తో చూస్తుండగానే ప్రాణాలు విడుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 1న అనంతపురం జిల్లాలో 19 ఏళ్ల తనూజ నాయక్‌ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయాడు. అతన్ని బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడని వైద్యులు తెలిపారు.

ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డకు గుండెపోటు ఏంటని ఆ తల్లిదండ్రులు స్థాణువయ్యారు. దేవుడు తమకు అన్యాయం చేశాడని, ఆడుతూ పాడుతూ తిరిగే తమ కుమారుడికి ఇంత చిన్న వయసులో ఈ ప్రాణాలు తీసే రోగమేంటని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు తనూజ నాయక్‌ది మడకశిర మండలం అచ్చంపల్లి తండా. అనంతపురం పట్టణంలోని పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. కాగా, కబడ్డీ ఆడుతూ తనూజ నాయక్‌ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!)

17 ఏళ్లకే ప్రాణాంతక ‘పోటు’
పల్నాడు జిల్లా పసుమర్రులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఫిరోజ్‌కు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)