Breaking News

‘ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబే’

Published on Sun, 04/19/2026 - 17:36

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అవినీతే దీనికి కారణమని చెప్పారు. అవినీతి కోసమే అమరావతిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘రాజధాని పేరుతో చంద్రబాబు తన వారికి దోచిపెడుతున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల ఖర్చు పెడతామంటున్నారు. అమరావతి పేరుతో భయంకరమైన దోపిడీకి చంద్రబాబు తెరదీశారు. ఇప్పటివరకు రాజధాని కోసం రూ.45 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా?

మావిగన్‌ ప్రతిపాదనతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చని జగన్‌ మావిగన్‌ ప్రతిపాదన తెచ్చారు. మావిగన్‌ ప్రతిపాదనతో టీడీపీలో భయం పట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. మావిగన్‌పై కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు’ అని అంబటి రాంబాబు చెప్పారు.

అమరావతి అసాధ్యమనే మావిగన్‌ ప్రతిపాదన
హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాలంటే గరిష్టంగా చదరపు అడుగుకు రూ.4500 ఖర్చవుతుందని అంబటి రాంబాబు అన్నారను. ‘తాడేపల్లి, గుంటూరు వంటి చోట్ల కట్టినా చదరపు అడుగుకు రూ.2500 అవుతుంది. పైస్టార్‌ హోటల్‌ లెక్కన కట్టినా చదరపు అడుగుకు విజయవాడ, గుంటూరుల్లోనూ రూ.3500 కంటే ఎక్కువ కాదు. కానీ అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఖర్చు పెట్డడం దోపిడీ కాదా? 

అనేక సందర్భాల్లో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పలేకపోతోంది. మేం దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి అంటున్నారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితి. ఇంత భయంకరమైన దోపిడీకి చంద్రబాబు అమరావతి పేరుతో తెర దీశారు. 

ఇప్పటికే రూ.75 వేల కోట్లు ప్రాథమిక వసతుల కోసం ఖర్చు పెట్టాలని అనుకున్నారు. ఇందులో రూ.45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం. అందుకే జగన్మోహన్‌ రెడ్డి మావిగన్‌ అనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో చంద్రబాబు గుండెల్లో రాయిపడినట్లయింది. దీనిపై జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే మావిగన్‌ మీద బూతులతో ట్రోలింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అంతా రివర్స్‌ అయింది. వాళ్ల వాదన తప్పని తేలిపోయింది. మావిగన్‌ పై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది’ అని చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)