కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు
Breaking News
అమర్‌నాథ్‌లో పెను విషాదం.. ఇద్దరు ఏపీ మహిళలు మృతి
Published on Mon, 07/11/2022 - 12:38
సాక్షి, న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం: అమర్‌నాథ్ యాత్రలో జరిగిన పెను విషాదంలో ఇద్దరు తెలుగు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 8న అమర్‌నాథ్ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుధ మృతదేహాన్ని భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ భవన్ కమిషనర్ కౌశిక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
చదవండి: Amarnath Yatra: 35 మంది ఏపీవాసులు సురక్షితం..
ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 37 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఇందులో 24 మంది సురక్షితంగా స్వస్థలాలకు పయనమయ్యారు. మరో 11 మంది ఏపీ అధికారులతో టచ్‌లో ఉన్నారు.
Tags : 1