Breaking News

అమరావతి ఓఆర్‌ఆర్‌.. 190 కిలో మీటర్లు.. 24,790 కోట్లు

Published on Mon, 10/20/2025 - 07:19

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) కంటే పెద్దగా అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం 190 కి.మీ.మేర 140 మీటర్ల వెడల్పు­లో భూసేకరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణం కోసం నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్మించింది. మొత్తం 190 కి.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రూ.24,790 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను అందజేసింది.

అమరావతి ఓఆర్‌ఆర్‌ డీపీఆర్‌లో ప్రధాన అంశాలు ఇవీ... 
👉హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పొడవు 158 కి.మీ. కాగా, అమరావతి ఓఆర్‌ఆర్‌ను 190 కి.మీ. మేర నిర్మించాలని నిర్ణయించారు. ఆరు లేన్లుగా ఓఆర్‌ఆర్‌ను నిర్మిస్తారు. అందుకోసం అమరావతిలో 190 కి.మీ. పొడవునా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు. భూసేకరణ వ్యయంలో రూ.వెయ్యి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.  

👉ఓఆర్‌ఆర్‌లో భాగంగా కృష్ణా నదిపై రెండు వంతెనలు నిర్మిస్తారు. ముప్పలూరు వద్ద 3.15 కి.­మీ. మేర మొదటి వంతెన, మున్నంగి వద్ద 4.8 కి.మీ. మేర రెండో వంతెన నిర్మించాలని నిర్ణయించారు. గంగినేనిపాలెం అటవీప్రాంతంలో రెండు టన్నెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి టన్నెల్‌ 1.64 కి.మీ., రెండో టన్నెల్‌ 2.68 కి.మీ. మేర నిర్మిస్తారు. ఇందుకోసం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.  

👉అమరావతి ప్రాంతాన్ని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానిస్తూ రెండు స్పర్‌ రోడ్లు ని‍ర్మిస్తారు. తెనాలి నుంచి కాజ టోల్‌ ప్లాజా వరకు 17.5 కి.మీ. మేర మొదటి స్పర్‌ రోడ్డు, నారా కోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.20 కి.మీ. మేర రెండో స్పర్‌ రోడ్డు నిరి్మస్తారు.  

👉అమరావతి ఓఆర్‌ఆర్‌ కోసం రూ.24,790 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,117 కోట్లు భరించనుంది. ప్రాజెక్టును 12 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)