Breaking News

బాబూ.. మీడియా ప్రచారమేనా?: అమరావతి జేఏసీ ఆగ్రహం

Published on Wed, 07/23/2025 - 12:07

సాక్షి, అమరావతి: అమరావతి పనులు నత్తనడకన సాగుతుండటంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణపై అమరావతి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమరావతి ఉద్యమంలో పని చేసిన మాకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ 13 నెలలు అవుతున్నా ఇప్పటి దాకా కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. సరికదా.. పనుల్లోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారని జేఏసీ మండిపడింది.

అమరావతి జేఏసీ సమన్వయ సభ్యుడు ఆలూరి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటిదాకా చాలావరకు ప్లాట్లలో రోడ్లు వేయలేదు. సరిహద్దు రోడ్లు కూడా వేయలేదు. పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. రాయపూడి వద్ద సీడీఎక్సెస్ రోడ్డు వద్ద పని ఎందుకు ఆగిపోయింది. ఈ పనిని ఎందుకు చేయలేకపోతున్నారు. వెంకటపాలెం వద్ద కూడా అలాగే ఉంది. కరకట్ట రోడ్డు పెంపు లేదు. మీడియాలో మాత్రమే ప్రచారం ఉంది.  

10 ఎకరాలు కూడా రైతులను ఒప్పించుకుని ఎందుకు తీసుకుని లేకపోతున్నారు?. రైతులకు కౌలు డబ్బులు ఇంకా జమచేయలేదు.. ఆగస్టు వస్తున్న ఎందుకు చేయలేదు?. రాజధాని చట్టబద్దతపై పార్లమెంట్‌లో మాట్లాడాలి. అమరావతి ఉద్యమంలో పని చేసిన మాకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ 13 నెలలు అవుతున్నా ఇప్పటి దాకా కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)