Breaking News

నోటీసుల్లో లోకేష్‌కు సీఐడీ ఏం చెప్పిందంటే..?

Published on Sat, 09/30/2023 - 19:32

సాక్షి, ఢిల్లీ: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. ఢిల్లీలో ఇవాళ నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సీఐడీ ఆదేశించింది. అమరావతిలో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? లావాదేవీల వివరాలివ్వాలని సూచించిన సీఐడీ.. హెరిటేజ్‌ బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన బుక్‌ సమర్పించాలంది. మినిట్స్‌ను ఆధారంగా చేసుకుని జరిపిన బ్యాంకు లావాదేవీలేంటీ?. చెల్లింపు వివరాలను పూర్తిగా అందించాలని నోటీసుల్లో పేర్కొంది.

నోటీసుల్లో 10 అంశాలు..
►భవిష్యత్తులో ఎలాంటి నేరానికి పాల్పడకూడదు
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదు
►ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదు
►పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి
►విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి
►వాస్తవాలను దాచిపెట్టకుండా వెల్లడించాలి
►హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలి
►భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి
►అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురండి
►నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం మీ అరెస్టు తప్పదు

కాగా, రాజధాని పేరిట లింగమనేనితో క్విడ్‌ ప్రో కో నడిపిన చంద్రబాబు కుటుంబం & హెరిటేజ్‌.. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని భూములు కొన్నారు. లింగమనేని నుంచి కరకట్ట గెస్ట్‌హౌజ్‌ను చంద్రబాబు కుటుంబం తీసుకుంది. రూ.29 లక్షలు నగదు రూపంలో ఇచ్చానని భువనేశ్వరీ చెబుతున్నారు. హెరిటేజ్‌తో ఏ ఏ లింకులు ఉన్నాయో క్షుణ్ణంగా సీఐడీ పరిశీలన చేసింది.
చదవండి: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కాం: నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)