Breaking News

రాజధాని అమరావతికి ముంపు తప్పదు

Published on Sat, 11/09/2024 - 05:12

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వరద నివారణ పనులు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్‌ స్టేషన్‌ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది. 

విస్తుపోతున్న అధికారులు, నిపుణులు
వరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..
ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరా­వతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.

⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.
⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.
⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలి.
⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్‌ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.
⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినే­జీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం చేపట్టాలి. 
⇒ ఉండ­వల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం చేపట్టాలి.
⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో  1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ 
నిల్వ సామర్థ్యంతో  రిటెన్షన్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలి.
⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలి.
⇒  నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలి. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)