Breaking News

అహోబిలంలో అరాచకం

Published on Thu, 12/18/2025 - 04:16

సాక్షి, నంద్యాల: కోట్లాదిమంది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం నరసింహక్షేత్రం ఇప్పుడు అధికార పార్టీ నేత అక్రమార్జనకు అడ్డాగా మారింది. కొబ్బరికాయ నుంచి తలనీలాలు.. చివరికి పార్కింగ్‌ నుంచి కూడా బీ ట్యాక్స్‌ రూపంలో పిండేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధి భర్తకు కమీషన్‌ ఇచ్చుకోవాల్సిందేనన్న పరిస్థితి నెలకొంది. టోల్‌గేట్, తలనీలాల టెండర్, టెంకాయల వేలం పాట, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలు.. ఇలా అన్నింటినుంచి ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. 

తలనీలాల సేకరణకు ఈ ఏడాది మార్చిలో దేవస్థానం అధికారులు టెండర్‌ పిలిచారు. చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామానికి చెందిన ఒక మహిళ రూ.1.50 కోట్లకు టెండర్‌ దక్కించుకున్నారు. ఈ టెండర్‌ దక్కేలా చేసినందుకు ఆమె బీ ట్యాక్స్‌ కింద రూ.20 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. టెండర్‌ దక్కించుకున్న తర్వాత పాట మొత్తాన్ని ఆలయానికి చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే చెల్లించారు. 

మిగిలిన రూ.1.1 కోట్లలో ఆలయానికి వచ్చేదెంతో, బీ ట్యాక్స్‌కు పోయేదెంతో అన్నది చర్చనీయాంశంగా ఉంది. 2024–25కు సంబంధించి తలనీలాల వేలం పాటనే నిర్వహించలేదు. ఏడాది పాటు పోగైన తలనీలాలను ప్రజాప్రతినిధి భర్త కిలో రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయించారు. సుమారు 700 కిలోల మేర తలనీలాల నుంచి రూ.63 లక్షలు కొల్లగొట్టారు.

టోల్‌గేట్‌లో నిలువు దోపిడీ
అహోబిలం ఆలయానికి వచ్చే ట్రాక్టర్లు, కార్లు, టూరిస్ట్‌ బస్సుల నుంచి పంచాయతీ అధికారులు టోల్‌ వసూలు చేస్తారు. ఏటా ఇందుకోసం టెండర్‌ పిలుస్తారు. ఈ ఏడాది జూన్‌లో టోల్‌గేట్‌కు వేలం పాట నిర్వహించారు. టెండర్‌లో వేరే వ్యక్తులు ఎవరూ పాల్గొనకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. 

సొక్కం వంశీకృష్ణ అనే వ్యక్తి రూ.20.31 లక్షలకు టెండర్‌ దక్కించుకున్నారు. వేలం పూర్తయిన వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. కానీ ఇప్పటివరకు ఈ మొత్తాన్ని పంచాయతీకి చెల్లించలేదు. కానీ అతడు బీ ట్యాక్స్‌ కింద రూ.65 లక్షలు చెల్లించినట్లు సమాచారం. దీంతో రూ.100 వసూలు చేయాల్సినచోట రూ.200 వసూలు చేస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. 

కొబ్బరికాయ రూ.70  
ఆలయంలో టెంకాయలు విక్రయించుకునేందుకు అధికారులు గతేడాది టెండర్‌ పిలిచారు. టెండర్‌లో ఎవరూ పాల్గొనకుండా చేసి రూ.35 లక్షలకు స్థానిక టీడీపీ నేత దక్కించుకున్నాడు. తనకు టెండర్‌ దక్కేలా చేసినందుకు 
బీ ట్యాక్స్‌ కింద రూ.40 లక్షలు సమర్పించుకున్నాడు. నియోజకవర్గ నేత అండదండలతో ఒక్కో టెంకాయను రూ.70కి విక్రయించి భక్తులను కొల్లగొట్టారు. రూ.35 లక్షలకు టెండర్‌ దక్కించుకున్న వ్యక్తి ఆలయానికి రూ.20లక్షలు మాత్రమే జమచేశారు.  

సారా బట్టీలు.. బెల్టుషాపులు 
అహోబిలానికి ఏడాది పొడవునా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ కొండల్లో సారా గుప్పుమంటోంది. 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది. తాళ్లకుంట కొండల్లో ఆరు, ఏడు బట్టీల్లో సారా కాస్తున్నారు. ఒక్కో బట్టీ నుంచి నియోజకవర్గ నేతకు మామూళ్లు వెళుతున్నాయి. సారాతో పాటు 8 మద్యం బెల్ట్‌ షాప్‌లు వెలిశాయి. పోతురాజు చెరువు, ఛత్రవట గుట్టల కింద మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ నుంచి రూ.500 కమీషన్‌ వసూలు చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలించి సహజ సంపదను కొల్లగొడుతున్నా అధికారులు స్పందించడం లేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)