యాంత్రీకరణ విఫలం

Published on Mon, 06/09/2025 - 02:42

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఘోరంగా విఫలమైంది. అవసరం లేని పరికరాలను బలవంతంగా అంటగట్టాలని చూడటంతో ఈ పథకం కింద  పరికరాలు తీసుకునేందుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పైగా ఆ పరికరాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే బహిరంగ మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉండడం, జీఎస్టీతో పాటు రవాణా భారంగా మారడం, రాయితీ తక్కువగా ఉండటం వంటి కారణాలతో రైతులు ముందుకు రాలేదు. దీంతో అర్ధాంతరంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

అంతన్నారు.. ఇంతన్నారు
కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటైన యంత్ర సేవా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యక్తిగత యాంత్రీకరణ పథకం అమలు చేయబోతున్నామని గొప్పగా ప్రకటించారు. కేంద్ర పథకమైన స్మామ్‌ (సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి 50 శాతం సబ్సిడీపై 42,864 పరికరాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.75.80 కోట్లు కేటాయించింది.

మార్కెట్‌ ధరలకు మించి ఉండటంతో..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు కమిటీలు తాము కోరుకున్న పరికరాన్ని కోరుకున్న కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండేది. పైగా బేరమాడుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా ప్రభుత్వమే ధరలు నిర్దేశించింది. ఈ ధరలకు అదనంగా ప్రతి పరికరంపై 12% నుంచి 18% జీఎస్టీతో పాటు.. 2% ఆగ్రోస్‌ సేవా చార్జీలు చెల్లించాలని నిర్దేశించారు. అంటే దాదాపు పరికరంపై ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే 14% నుంచి 20% వరకు అదనపు భారం పడుతోంది. 

అంటే ఓ పరికరం ధర రూ.25 వేలు అయితే.. కనీస జీఎస్టీ, ఆగ్రోస్‌ రుసుం కలిపి 14% చొప్పున లెక్కేసినా రూ.3,500, అదే రూ.లక్ష విలువైన పరికరమైతే రూ.1.14 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే రైతు నేరుగా కొనుక్కుంటే డీలర్ల వద్ద బేరమాడుకుంటే తక్కువ ధరకే లభిస్తుంది. తైవాన్‌ స్ప్రేయర్‌ బహిరంగ మార్కెట్లో రూ.18 వేల నుంచి రూ.20 వేలకు లభిస్తుండగా, యాంత్రీకరణ పథకంలో రూ.26 వేలుగా నిర్ణయించి, అందులో రూ.10 వేల రాయితీ ప్రకటించారు. 

దీనిపై జీఎస్టీ, వ్యవసాయ ఆగ్రోస్‌ సేవా చార్జీలు అదనం. ట్రాక్టర్‌ ఆధారిత యంత్ర పరికరాలు కూడా రైతులు సొంతంగా కొనుక్కుంటేనే తక్కువకు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కూడా రైతులకు ప్రతిబంధకంగా మారాయి.కవీుషన్లకు కక్కుర్తిపడి రైతులకు అవసరం లేని, డిమాండ్‌ లేని,  పనికి రాని పరికరాలను అంటగట్టాలని చూడటంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

సాధారణంగా వ్యక్తిగత పరికరాలు సబ్సిడీపై ఇస్తామంటే రైతులెవరైనా ఎగబడతారు. అలాంటిది రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం అమలు చేసిన ఈ యాంత్రీకరణ పథకం ఏడాదిలోనే అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. ఇందుకోసం కేటాయించిన మొత్తంలో చాలావరకు కమీషన్ల రూపంలో పక్కదారి పట్టినట్టు విమర్శలు వచ్చాయి. దీంతో పథకాన్ని 2024–25 ఏడాదికి అర్థంతరంగా నిలిపివేశారు. 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)