Breaking News

పవన్‌ను కలిసినా జరగని న్యాయం.. తల్లి,కుమార్తె ఆత్మహత్యాయత్నం

Published on Sun, 03/02/2025 - 17:43

సాక్షి,విజయవాడ : అదనపు కట్నం కోసం అత్తింటి అరళ్లు వేగలేకపోతున్నా న్యాయం చేయాలని ఓ బాధితురాలు హోంమంత్రి, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేని అర్జించింది. వాళ్లు పట్టించుకోకపోవడంతో తనకు ఇక చావే శరణ్యమనుకుంది. కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకి ఏం జరిగిందంటే?

విజయవాడలో ఆడపిల్లలు పుట్టారని కారణంగా చూపిస్తూ సుభాషిణి అనే మహిళను అత్తమామలు, భర్త, మరిది వేధింపులకు గురి చేసేవారు. ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. సుభాషిణి తన కుమార్తె (మైనర్‌)తో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం కోసం నా భర్త , అత్తమామలు, మరిది వేధిస్తున్నారు.  నా భర్తను ఏడాది నుంచి మా ఇంటికి రానివ్వడం లేదు. నన్ను వదిలించుకోవడానికి గతంలో పిచ్చెక్కిందని పిచ్చాసుపత్రిలో చేర్పించారు. 
 
జనసేన కార్యాలయం చుట్టూ పది సార్లు తిరిగా. పవన్ కళ్యాణ్‌ను ఓ అన్నలా భావించా. న్యాయం జరుగుతుందనుకుని జనసేన కార్యాలయం చుట్టూ తిరిగా. ఓ పవన్ అభిమానిగా న్యాయం జరుగుతుందని నేను ఆశించా. ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం ఎంతో ప్రయత్నించా ..దొరకనివ్వలేదు. ఫ్యామిలీ మ్యాటర్‌లో మేం ఇన్వాల్వ్ అవ్వమన్నారు. న్యాయం కోసం హోంమంత్రి అనితను కలిశా. అక్కడ న్యాయం జరగలేదు.  జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ... నా సమస్య తీర్చమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు అప్పగించారు.

బోండా ఉమా నా సమస్య తీర్చమని విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి దగ్గరకు పంపించారు. విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి నన్ను బెదిరించి .. తీవ్ర దూర్భషలాడారు. మేం ఉన్నంత వరకూ నీకు న్యాయం జరగదని చక్రవర్తి బెదిరించారు. నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాం’ అని వాపోయారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)