Breaking News

ఎయిడెడ్‌ పాఠశాలలపై కొరడా!

Published on Fri, 02/14/2025 - 03:49

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని గత మూడేళ్లుగా చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ ఆదేశించింది. 2024–25 విద్యా సంవత్సరం యూడైస్‌ ఆధారంగా 40 కంటే ఎక్కువ మంది విద్యార్థులను పెంచుకోలేని ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. అలాంటి స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకుని ఉంటే నివేదిక పంపాలని కోరింది. 

దీంతోపాటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించేందుకు మండల స్థాయిలో త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇందులో డీవైఈవో, ఎంఈవో, సీనియర్‌ హెచ్‌ఎం సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే యూడైస్, వాస్తవ హాజరులో తేడా ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఎయిడెడ్‌ పాఠశాలల్లోని ప్రవేశ రిజిస్టర్లు, విద్యార్థుల రికార్డులను ఒకటికి రెండుసార్లు త్రీమెన్‌ కమిటీ పరిశీలించనుంది. 

వారు ఇచ్చే సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు పాఠశాలలు, మండలాలు, జిల్లాల వారీగా వాస్తవ హాజరు నమోదు ఎంత అనేది నిర్ధారించి రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు నివేదిక అందిస్తారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 595 ఎయిడెడ్‌ పాఠశాలలు కొనసాగుతుండగా, 3,010 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 40 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 126 కాగా, అసలు విద్యార్థులే లేకుండా 80 స్కూళ్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూళ్లపై విద్యాశాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

‘ఎయిడెడ్‌ టీచర్లకు న్యాయం చేయాలి’
ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు బదలాయించి న్యాయం చేయాలని, మొత్తం ఎయిడెడ్‌ సెక్టార్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌  కోరారు. ఎయిడెడ్‌ స్కూళ్లల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్‌కే చిన్నప్ప, ప్రతినిధి సీహెచ్‌ ప్రభాకర్‌రెడ్డి కోరారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)