Breaking News

మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌

Published on Sat, 09/06/2025 - 11:37

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ లభించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీన సరెండర్‌ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది.

అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్‌ ఎంపీ మిథున్‌రెడ్డి పేరును ఏ4గా చేర్చింది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్‌ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట ఎదుట విచారణకు హాజరయ్యారాయన. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదేరోజు రాత్రి సిట్‌ అరెస్ట్‌ చేసింది. 

ఈ క్రమంలో.. కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేరొన్నారాయన. అయితే.. 

మిథున్‌రెడ్డి పిటిషన్‌కు అర్హత లేదని సిట్‌ వాదించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. చివరకు కోర్టు మిథున్‌రెడ్డి తరఫు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)