Breaking News

వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరు

Published on Fri, 05/16/2025 - 18:53

సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరైంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి  బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరవ్వగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీపై ఇప్పటి వరకూ నమోదైన 6 కేసుల్లో బెయిల్ మంజూరైంది.

90 రోజులుగా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. వరుసగా ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తున్న తరుణంలో వంశీపై కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వంశీపై నిన్న నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు.. ఇవాళ నూజివీడు కోర్టులో వంశీని హాజరు పరిచారు.

ఈ నెల 29 వరకూ నూజివీడు కోర్టు రిమాండ్ విధించగా.. ఇవాళ తాజాగా వల్లభనేని వంశీపై మరో కేసును గన్నవరం పోలీసులు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 58 పేజీలతో పోలీసులకు గనుల శాఖ ఏడీ  ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‍లో కేసు నమోదైంది. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని గన్నవరం పోలీసుల నిర్ణయించారు. వంశీపై కూటమి కక్షసాధింపు చర్యలపై ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. జైల్లో వంశీ శ్వాసకోస సమస్య, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)