Breaking News

రెండేళ్లలో 13.37 లక్షల పుస్తకాల ముద్రణ 

Published on Fri, 03/22/2024 - 05:09

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అకాడమీ ప్రచురణలను మార్కెట్‌లోకి తీసుకొచ్చి నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి, ఉన్నత విద్యకు అవసరమైన విజ్ఞాన సంపదను అందించేందుకు అకాడమీ విశేష కృషి చేస్తోందన్నారు. గురువారం వడ్డేశ్వరంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి అకాడమీ విభజన పూర్తయిన తర్వా­త ఏపీలో సేవలు ప్రారంభించిన రెండేళ్లలో రూ. 21 కోట్ల విలువైన 13.37 లక్షల పుస్తకాలను ముద్రించామన్నారు.

డీఎస్సీ, బీఈడీ, టెట్, ఏపీపీఎస్సీతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షల సిలబస్‌తో 67 రకాల పుస్తకాలకు సంబంధించి 3 లక్షల కాపీలను మార్కెట్‌లోకి విడుదల చేశామన్నారు. వీటితో పాటు 10.37 లక్షల ఇంటర్మీడియెట్‌ పాఠ్యపుస్తకాల­ను ముద్రించడం ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ధరకు స్టడీ మెటీరియల్స్‌ అందించామన్నారు.

ఆంగ్లం, ఇతర భా­షల ద్వారా వాడుకలోకి వచ్చి న పదాలకు త్వరలోనే తెలుగు పదజాలాన్ని రూపొందిస్తామన్నారు. తెలుగు–సంస్కృతం–ఆంగ్లం కలగలిపిన త్రిభాషా పదకోశాన్ని (డిక్షనరీ) ముద్రిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పాఠ్యప్రణాళికలకు తగ్గట్టుగా పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇకపై అకాడమీ ప్రతి ముద్రణను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రవేశపెడుతుందన్నారు. 

బాబు స్వార్థానికి అకాడమీ బలి 
చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు తెలుగు అకాడమీ తీవ్రంగా నష్టపోయిందని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో తెలుగు అకాడమీ విభజనను పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తె­లు­గు అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం కోర్టుకు వెళ్లి ఉమ్మడి అకాడమీ విభజన పూర్తి చేసి ఏపీ వాటా కింద రూ. 140 కోట్లు సాధించామన్నారు. కానీ, చంద్రబాబు అకా­డమీ ప్రచురణలకు పాతరేసి నారాయణకు పాఠ్యపుస్తకాల ముద్రణను కట్టబెట్టడం ద్వారా భారీ రేట్లకు విక్రయించి రూ. కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. 

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియా అకాడమీ సేవలపై విషం చిమ్ముతోందన్నారు. తిరుపతి నుంచే తెలు­గు, సంస్కృత అకా­డమీలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. విజయవాడ కేంద్రంలో ఎక్కువ ముద్రణాలయాలు ఉండటంతో ప్రింటింగ్‌ ఉద్యోగులు మాత్రమే స్థానిక కార్యాలయంలో సేవ­లందిస్తున్నారన్నారు. త్వరలోనే తిరుపతిలో ఎస్వీ వర్సి­టీ స్థలంలో తెలుగు, సంస్కృత అకాడమీ శాశ్వత భవనం నిర్మాణాన్ని చేపడతామన్నారు. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)