Breaking News

‘కూటమి ప్రభుత్వం భూమిని లాగేసుకుంది.. కారుణ్య మరణానికి అనుమతించండి’

Published on Sun, 10/26/2025 - 05:27

తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె చెరుకూరి వెంకాయమ్మ, మానసిక వైకల్యం గల మనవరాలు చెరుకూరి శ్యామల కారుణ్య మరణానికి అనుమ­తించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తమ జీవితానికి చివరి ఆసరాగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం లాక్కుందని.. తా­ము ఎన్ని ఫిర్యాదులు, వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని హైకోర్టుకు సమర్పించిన రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కింద ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం తీసుకుంది. తమ ఏకైక ఆధారాన్ని లాగేసుకోవడం వల్ల తమ జీవనాధారం పోయిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తమ ఫిర్యాదులు, వినతులు పట్టించుకోవడం లేదని.. తద్వారా రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ముఖ్యంగా జీవన హక్కు (ఆర్టికల్‌ 21), సమానత్వ హక్కు (ఆరి్టకల్‌ 14), ఆస్తి హక్కు (ఆర్టికల్‌ 300ఏ) ఉల్లంఘించబడిందని వాపోయారు. 

తమ దుస్థితి దృష్ట్యా పిటిషనర్లు ముగ్గురూ హైకోర్టును రెండు ప్రధాన అంశాలపై వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వా­రా ఒక కేర్‌ టేకర్‌ను నియమించి తమ ఆహారం, వైద్యచికిత్స, విద్యుత్‌ బిల్లులు, జీవనాధార ఖర్చు­లు భరించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ స­హాయం అందించలేని స్థితిలో ఉంటే.. కారుణ్య మ­రణానికి తమకు న్యాయపరమైన అనుమతి ఇవ్వా­ల­ని కోరారు. 

‘మానవ గౌరవం లేకుండా జీవించ­డం కన్నా.. గౌరవంగా మరణించడం మేలు. మ­మ్మ­ల్ని ఈ స్థితికి ప్రభుత్వం నెట్టేసింది’ అని వృద్ధురాలు శేషగిరమ్మ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లోని మా­నవ హక్కుల ఉల్లంఘణ కోణాన్ని బయటపెడుతోంది. వికాసం పేరుతో పేదలు, వృద్ధులు, ది­వ్యాంగులు తమ భూములు, గౌరవం, జీవన హక్కు­లు కోల్పోతున్న వైనాన్ని పిటిషన్‌ చాటి చెబుతోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)