Breaking News

89 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Published on Sun, 02/08/2026 - 03:58

రంపచోడవరం: ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అనారోగ్యం బారిన పడి విద్యార్థులు మరణిస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నా.. చంద్రబాబు సర్కారులో చలనం కనపడడం లేదు. గిరిజన చిన్నారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూనే ఉంది. పర్యవసానంగా తాజాగా పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శనివారం ఉదయం ఉడకని ఇడ్లీ, నిల్వ శనగపిండి చట్నీ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో మొత్తం 277 మంది విద్యార్థులు ఉండగా వారిలో 89 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 70 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 18 మంది మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్నారు. బొరగ బుజ్జిబాబుదొర అనే విద్యార్థి వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. 

మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనేక మంది అనారోగ్య కారణాలతో మరణించినా సర్కారులో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆమె ఐటీడీఏ పీఓ  స్మరణ్‌రాజ్‌తో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇదిలా ఉంటే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో బెడ్లు సరిపోక ఒకే మంచంపై నలుగురైదుగురిని కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)