Breaking News

నిల్వ ఆహారం తిని 8 మంది బాలికలకు అస్వస్థత

Published on Wed, 12/11/2024 - 05:38

పెదబయలు: ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్‌ మీట్‌ (పీటీఎం)లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాన్ని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి 8 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పెదబయలు మండలం, గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు.

ఆరోజు తల్లిదండ్రులకు పెట్టిన తరువాత మిగిలిన బంగాళదుంప, బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి.శ్రావణి, చాందిని, పి.స్వాతి, పి.బిందు (4వ తరగతి), కె.హర్షిత(3వ తరగతి), 2వ తరగతి విద్యార్థులు పి.హిందువదన, పి.సెల్లమ్మి, జి.రíÙ్మ అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లో గోమండి పీహెచ్‌సీకి తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.వసంతను వివరణ కోరగా... తల్లిదండ్రుల సమావేశానికి వచి్చన 200మందికి ఆహారం వడ్డించామనీ, మిగిలిన అన్నం, కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

తనకు ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్లానని, విద్యార్థుల అస్వస్థత విషయం ఏఎన్‌ఎం తనకు ఫోన్‌లో చెప్పడంతో తక్షణమే పీహెచ్‌సీకి సమాచారం అందించి, విద్యార్థులకు చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచి్చన సమాచారం మేరకు సోమవారం స్కూల్‌కు వెళ్లి 11మంది విద్యార్థులకు వైద్యం చేశామనీ, వారిలో పరిస్థితి బాగోలేని 8మందిని పీహెచ్‌సీకి తరలించినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి చైతన్యకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)