Breaking News

అంత కష్టం ఏమొచ్చిందో..

Published on Sat, 04/05/2025 - 12:32

నెల్లూరు: ఆడుతూ.. పాడుతూ తిరిగే బాలికకు ఏ కష్టమొచ్చిందో తెలియదు గానీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూరులో గురువారం జరిగింది. ఎస్సై జిలానీ, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని వందూరుగుంట ప్రాంతానికి చెందిన ప్రకాష్‌, రత్నమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. ప్రకాష్‌ పెయింట్‌ పనిచేస్తుంటాడు. రత్నమ్మ ప్రభుత్వాస్పత్రిలో తాత్కాలిక నర్సుగా వ్యవహరిస్తోంది.

 పెద్ద కుమార్తె నిహారిక (11) జెడ్పీ బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నిహారిక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చింది. నానమ్మ భోజనం తినాలని చెప్పగా స్కూల్లోనే చేశానంది. ఆ సమయంలో రత్నమ్మ సమీపంలోని తెలిసిన వారింటికి వెళ్లింది. కొద్దిసేపటి అనంతరం ఆమె ఇంటికొచ్చి కుమార్తెను పిలవగా స్పందన లేదు. దీంతో నానమ్మ మిద్దైపెన బాత్‌రూమ్‌కు వెళ్లిందని చెప్పడంతో తల్లి అక్కడికి వెళ్లి పిలిచింది. అయితే నిహారిక పలక్కపోవడంతో కేకలు వేసింది. 

కిందనే ఉన్న భర్త ప్రకాష్‌కు తెలిపింది. అతను పైకి వచ్చి కొంత ప్రయత్నం చేసి తలుపు తీశాడు. ఇనుప పైపునకు చున్నీతో ఉరేసుకుని కనిపించిన నిహారికను చూసి తల్లిదండ్రులు షాక్‌ తిన్నారు. బాలికను కిందకు దించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు తల్లి గుర్తించింది. హుషారుగా తిరిగే నిహారిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ కానిస్టేబుల్‌ విజయకుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)