Breaking News

మన నగరాల్లో కాలుష్యం తక్కువే

Published on Sat, 02/01/2025 - 05:02

సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు­/క్యూబిక్‌ మీటర్‌), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవ­త్సరానికి గాను సీఆర్‌ఈఏ (సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరి­శుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లా­లోని మడికేరి నగరం చోటు సంపాదించింది. 

ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణా­టక­లోని కొప్పల్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్‌ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథ­పురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది. 

226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశ­వ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్‌వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, బిహార్‌లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది. 

గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖ­పట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయ­వాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.

నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్‌..
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఏపీ (నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్‌ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)