Breaking News

గడచిన ఐదేళ్లలో 40శాతం గోదాముల సామర్థ్యం పెంపు

Published on Thu, 03/07/2024 - 01:48

గన్నవరం: గడిచిన ఐదేళ్లలో గోదాముల సామర్థ్యాన్ని 40 శాతం పెంచడం  రైతుల పట్ల సీఎం వైఎస్‌ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.11.88 కోట్లతో నిర్మించిన 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు, 60 టన్నుల కెపాసిటీ కలిగిన లారీ వేబ్రిడ్జిని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు కాకాణి పేర్కొన్నారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ స్థాపించిన 65 ఏళ్లలో 8.86 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సొంత గోదాములను నిర్మించినట్లు చెప్పారు. వీటిలో 2,23,300 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే నిర్మించినట్లు తెలిపారు. మరో 24,600 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. పాత గోదాములను రూ.21 కోట్లతో ఆధునికీకరించినట్లు తెలిపారు. ఈ గోదాముల్లో నిల్వ చేసుకునే పంట ఉత్పత్తులకు సంస్థ జారీ చేసే నిల్వ రశీదుపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.

నిల్వ చార్జీల్లో 25 శాతం రైతులకు రిబేటు కల్పిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్‌ జనాబ్‌ కరిముల్లా షేక్‌ అమీన్‌ మాట్లాడుతూ.. ఈ గోదాముల్లో పంట ఉత్పత్తులు దెబ్బ తినకుండా కెమికల్‌ ట్రిట్‌మెంట్‌తోపాటు శిక్షణ పొం­దిన సిబ్బంది పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్, కో ఆపరేషన్‌ ముఖ్య కార్యదర్శి బాబు.ఏ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్‌ చైర్మన్‌ ఎండీ జి.ఓంకార్‌రెడ్డి,  పలువురు ఏఎంసీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)