Breaking News

స్వదేశానికి గుడ్‌ బై

Published on Thu, 01/02/2025 - 04:53

సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్‌బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 

2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు పేర్కొంది.

అమెరికాలో రెండో స్థానం 
వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 

అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గుచూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)