Breaking News

15 మంది బాలికలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Published on Mon, 09/02/2024 - 04:17

సాక్షి, పాడేరు: జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరో 15 మంది గిరిజన బాలికలు ఆదివారం అస్వ­స్థతకు గురయ్యారు. వారికి ఆదివారం మధ్యాహ్నం వాంతులు, కడుపునొప్పితో పాటు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో కనబడ్డాయి. కిల్లోగుడ వైద్య బృందం ప్రాథమిక వైద్యసేవలు అందించి, మెరుగైన వైద్యానికి హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్యపరీక్షలు నిర్వ­హించడంతో వారు కోలుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో 15 మంది అస్వస్థతకు గురవడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు జామిగుడ ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి పంపిణీ చేపట్టారు.

50 మంది విద్యార్థినులు డిశ్చార్జి
రెండు రోజుల నుంచి అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న జామిగుడ పాఠశాలకు చెందిన బాధిత విద్యార్థినులు 61 మందిలో 50 మంది కోలుకున్నారు. వారిని అంబులెన్స్‌ల్లో జామిగుడ ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన 15 మందితో కలిపి, మొత్తం 26 మంది గిరిజన విద్యార్థులు వైద్యుల వైద్యసేవలు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఫుడ్‌ కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ చర్యలు
సాక్షి, అమరావతి : కలుషితాహారం ఘటనపై విచా­రణ కమిటీ సిఫారసుల మేరకు నూజివీడు ట్రిఫుల్‌ ఐటీలో ప్రస్తుతం కేటరింగ్‌ సేవలు అందిస్తున్న  పైన్‌ క్యాటరింగ్‌ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీ సేవ­లను తక్షణమే రద్దు చేయడంతో పాటు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి లోకేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టాలని చెప్పారు. ఈ మేరకు ఆది­వారం ప్రకటన విడుదల చేశారు.

కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా కేఎంకే క్యాటరింగ్‌ సేవ­లను ఉపయోగించుకోవాలని ట్రిపుల్‌ ఐటి అధికా­రులకు సూచించారు. ‘పెండింగ్‌లో ఉన్నఫుడ్‌ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసు­కోవాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారాన్ని క్యాంపస్‌లోకి అనుమ­తించొద్దు. ఫుడ్‌ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలి. అప్పటి వరకు ఫుడ్‌ చెయిన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)