Breaking News

నాన్నా.. అమ్మను బాగా చూసుకో

Published on Sat, 11/22/2025 - 09:57

ఏలూరు జిల్లా: ‘నాన్నా.. అమ్మను బాగా చూసుకో.. ఏమీ అనవద్దు.. ఐ మిస్‌ యూ.. మావయ్య.. సారీ.. ఐ మిస్‌ యూ... చెల్లెళ్లిద్దరూ బంగారం.. వా రిని బాగా చదివించండి.. మా ప్రిన్సిపాల్, హౌస్‌ టీచర్‌ చాలా మంచివాళ్లు.. ఏమీ అనవద్దు..’ అని సూసైడ్‌ నోట్‌ రాసి గురుకుల విద్యార్థిని బలవన్మరణం చెందింది. పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం..

 జంగారెడ్డిగూడెం బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో టెన్త్‌ విద్యార్థిని పొడవాటి కావ్య (15) శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పిల్లలందరూ భో జనానికి వెళ్లగా తరగతి గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉ రివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ ఎంవీ సు భా‹Ù, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్‌ గంగాభవాని, మహిళా టీచ ర్లు, కావ్య స్నేహితులను విచారించారు. సీసీ టీవీ రికార్డులను పరిశీలించారు. కావ్య స్నేహితులు మాట్లాడుతూ కావ్య తల్లి ఉషారాణి కిడ్నీ సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్నారని, తరచూ డ యాలసిస్‌ చేయాల్సి రావడంతో కుటుంబం ఇబ్బంది పడుతోందన్నారు. 

ఈ నేపథ్యంలో తన తల్లి బాధను చూడలేక చదువు మానేయాలని ఉందని పలుమార్లు తమకు చెప్పిందని అన్నారు. తల్లి అనారోగ్యంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కావ్యకు ఇద్దరు చెల్లెళ్లు ఉండగా, పెద్ద చెల్లెలు సౌమ్య ఇదే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తాడువాయి పంచాయతీ జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి గంగాధరరావు, ఉషారాణి పెద్ద కుమార్తె కావ్య. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పాఠశాల వద్ద పీడీఎస్‌యూ, దళిత సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొద్దిసేపు ఆందోళన చేశారు.  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)