Breaking News

చిన్న వయసులో ఏ కష్టం వచ్చిందో..

Published on Tue, 03/03/2026 - 13:38

ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని నడింపల్లె ఎస్సీహాస్టల్‌లో చదువుకుంటున్న తలారి నరసింహులు (16) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం మండలంలోని కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి ఓబులేసు, గంగాదేవి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు. ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో ఉంటున్న గంగాదేవి సోదరి నాగలక్ష్మికి పిల్లలు లేరు. దీంతో ఆమె మూడేళ్ల వయసు నుంచి నరసింహులును పోషించుకుంటోంది. 

అతను 6వ తరగతి నుంచి ప్రొద్దుటూరులోని నడింపల్లె హాస్టల్‌లలో ఉంటూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. నరసింహులు ప్రస్తుతం పదోతరగతి చదువుకుంటున్నాడు. ప్రతి ఆదివారం పోట్లదుర్తిలో ఉంటున్న తమ పెద్దమ్మ వద్దకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఈ ఆదివారం కూడా అతను పోట్లదుర్తికి వెళ్లాడు. రాత్రి ఇక్కడే ఉండమని పెద్దమ్మ చెప్పినా వినలేదు. స్టడీ క్లాస్‌ ఉందని చెప్పి సాయంత్రం ప్రొద్దుటూరుకు వచ్చాడు.  

రాత్రి పడుకున్నాడు.. ఉదయం శవమై కనిపించాడు
రాత్రి అందరితో పాటు నరసింహులు చదువుకున్నాడు. భోజనం చేసి తోటి పిల్లలతో సరదాగా కొంతసేపు ఆడుకున్నాడు. అయితే అదరూ 10 గంటలకు పడుకున్నా అతను మాత్రం రాత్రి 11 గంటల వరకు పడుకోకుండా దిగాలుగా కూర్చొని ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. పడుకుందాం రారా అని పిలిచినా అతను రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో విద్యార్థులు బయటికి రాగా హాస్టల్‌ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని నరసింహులు వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్‌ వార్డెన్‌ బ్రహ్మయ్య దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణం ఉంటుందేమోనని అందరూ కలిసి చెట్టుకు వేలాడుతున్న నరసింహాలును కిందికి దించారు. 

అయితే అప్పటికే అతను చనిపోయాడు. తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసింహులు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. విద్యార్థులను దిక్కులేని వారిగా వదిలేశారని, రాత్రి ఒక్కరు కూడా పిల్లలను చూసువడానికి హాస్టల్‌లో ఉండలేదని వాపోయారు. ఏ ఒక్కరు రాత్రి హాస్టల్‌లో ఉన్నా నరసింహులు ప్రాణాలతో ఉండేవాడని తెలిపారు. టూ టౌన్‌ సీఐ వంశీనాథ్, ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తీసుకెళ్లేందుకు విద్యార్థి బంధువులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తాం
విద్యార్థి నరసింహులు ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సరస్వతి, జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభ పేర్కొన్నారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. కాగా విద్యార్థి మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల భయంతో మానసిక ఒత్తిడికి గురై తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఓబులేసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా తమ కుమారుడి మరణానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)