Breaking News

పదహారేళ్లకే ప్రసవం

Published on Sun, 10/26/2025 - 11:47

అనంతపురం సిటీ: పదహారేళ్లు నిండకనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ బాలిక. విశ్వసనీయ సమాచారం మేరకు.. యాడికి మండలానికి చెందిన బాలిక (16) పదో తరగతి వరకు చదివింది. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించినా చదువు మానేసి, డ్రాపవుట్‌గా మిగిలిపోయింది. అమ్మానాన్న కూలీ పనులకు వెళ్తే, తను ఇంటి పట్టున ఉండేది. అమ్మమ్మ ఊరైన కర్నూలు జిల్లా మద్దికెరకు తరచూ వెళ్లొచ్చేది. ఈ క్రమంలో మద్దికెరకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ దగ్గరవడంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమంటే ఉద్యోగం వచ్చాక చేసుకుంటానంటూ రాజా దాటవేస్తూ వచ్చాడు. విషయం తెలిసినా 9 నెలలు నిండే వరకు కుటుంబ సభ్యులు కూడా గోప్యత పాటిస్తూ వచ్చారు. 

బుధవారం స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వద్దకు బాలికను తీసుకెళ్లి ఐదు నెలల గర్భిణి అని చెప్పారు. గర్భవిచ్ఛిత్తికి మాత్రలు కావాలని అడిగిన వెంటనే అతను రాసిచ్చేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి మింగిన కాసేపటికి విపరీతమైన రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు భయపడిపోయారు. వెంటనే గ్రామ ఆశా వర్కర్‌ దృష్టికి తీసుకెళ్తే ఆమె మందలించి గుత్తిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. బాలిక పరిస్థితి చూసిన అక్కడి వైద్యులు అడ్మిట్‌కు నిరాకరించడంతో పాటు వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించాలని చెప్పడంతో బాలికను ఇక్కడికి తీసుకొచ్చి బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్చారు. బాలిక అర్ధరాత్రి ఒంటిగంట తరువాత సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత తెలిపారు.

రంగంలోకి అధికారులు
విషయం తెలిసిన వెంటనే ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ అరుణకుమారి, మిషన్‌ వాత్సల్య–మిషన్‌ శక్తి జిల్లా కో–ఆర్డినేటర్‌ బీఎన్‌ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ్‌, సఖి మేనేజర్‌ శాంతామణి, చైల్డ్‌లైన్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ కృష్ణమాచారి రంగంలోకి దిగారు. పోలీసులతో కలసి సర్వజనాస్పత్రికి చేరుకుని బాలికతో మాట్లాడారు. వివరాలు చెప్పేందుకు బాలిక అంగీకరించకపోవడంతో ఆమె తల్లిదండ్రులను సఖి సెంటర్‌కు పిలిపించి విచారించారు. మాయమాటలతో లొంగదీసుకొని, బాలికను తల్లిని చేసిన మద్దికెరకు చెందిన రాజాపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)