అత్యవసర సేవకుల సమ్మెబాట

Published on Sun, 11/17/2024 - 04:48

సాక్షి నెట్‌వర్క్‌: తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. బాబు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినా 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్టు సంస్థను మార్చి మరింత గందరగోళానికి గురిచేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమ­య్యారు. ఈ మేరకు ఏపీ 108 సర్వీసెస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఇటీవల డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ అదనపు సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చారు. 

మొత్తం 3,600 మంది ఉద్యోగులు (ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్లు, పైలెట్లు) సమ్మెలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 768 అంబులెన్స్‌లు నిలిచిపోనున్నాయి. ఆపదలో ప్రాణాలు కాపాడే అపర సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్‌ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. 

108 సర్వీస్‌లను ప్రభుత్వమే నిర్వహించాలి.. ఉద్యోగులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి.. వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 108లో పని చేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వాలి.. మరణించిన 108 ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు ఇవ్వాలి.. తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయనగరం, అనకాపల్లి, విశాఖ, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీఆర్వో, మండల స్థాయి అధికారులకు సమ్మె నోటిస్‌లు ఇచ్చారు.   

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)