Breaking News

శభాష్‌ శ్రీరాములు!

Published on Wed, 08/28/2024 - 12:20

విశాఖ స్పోర్ట్స్‌: వయసు 100 దాటినా అది అంకె మాత్రమే అంటూ అథ్లెటిక్స్‌లోనూ దూసుకుపోతున్నారు విశాఖకు చెందిన నేవీ కమాండర్‌ వల్లభజోస్యుల శ్రీరాములు. ఈ నెల 13–25 వరకు స్వీడన్‌లోని గోథెన్‌బర్‌్గలో జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫీల్డ్‌ అంశాలైన జావెలిన్‌ త్రో, డిస్కస్‌త్రో పాటు షాట్‌పుట్‌లోనూ 101 ఏళ్ల వయసులో విజేతగా నిలిచి 3 స్వర్ణ పతకాలను శ్రీరాములు సాధించారు.

 స్వాతంత్య్రానికి ముందే రాయల్‌ ఇండియన్‌ నేవీలో చేరిన శ్రీరాములు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం స్వతంత్ర భారత్‌లోనూ భారత నావికా దళంలో అధికారిగా నియమితులయ్యారు. కళాశాల రోజుల నుంచే క్రీడాకారుడైన శ్రీరాములు అప్పట్లో ఫుట్‌బాల్‌తో పాటు అథ్లెటిక్‌ అంశాల్లో పాల్గొనేవారు. పదవీ విరమణ అనంతరం విశాఖలోని తన స్వగృహంలో గతేడాది నూరు వసంతాల్ని పూర్తి చేసుకున్నారు. 

జూలైలో 101వ జన్మదినాన్ని నిర్వహించుకున్న ఈయన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 3 స్వర్ణాల్ని అందుకుని, మంగళవారం విశాఖ చేరుకున్నారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. 2011 నుంచి 15 వరకు కాలికి గాయం కావడంతో కాస్త విరామం ఇచ్చినా, తిరిగి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం ఆనందాని్నస్తోందని చెప్పారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మాస్టర్స్‌ పోటీల్లో 24 పతకాల్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు. 81 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్లు శ్రీరాములు చెప్పారు.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి