Breaking News

పెళ్లి మండపంలో భారీ చోరీ

Published on Sat, 06/03/2023 - 00:22

రూ.7.50 లక్షలతో పాటు బంగారం మాయం

లబోదిబోమంటున్న ఆడబిడ్డ తల్లిదండ్రులు

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ఆడబిడ్డ పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును దొంగ దోచుకెళ్లిన ఘటన అనంతపురం నగర శివారులోని నీలం రాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో గురువారం చోటు చేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాప్తాడుకు చెందిన బిళ్లేనారాయణస్వామి కుమార్తెని, వేపకుంటకు చెందిన సోమన్న కుమారుడు (ప్రస్తుతం తిరుమలలో వైద్యుడు)కి ఇచ్చి వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా అనంతపురం శివారులోని నీలంరాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో మే 31 ముహూర్తం కాగా 1న తలంబ్రాలు జరిగాయి. గురువారం పెళ్లి వేడుకకు హాజరైన బంధువులు, మిత్రులు నూతన వధువరులకు తెచ్చిన బహుమతులను వధువు తల్లిదండ్రులు ఓ గదిలోకి సర్దుతున్నారు. ఈ సమయంలో బిళ్లే నారాయణస్వామి తన చేతిలో ఉన్న రూ.7.50 లక్షలతో పాటు రెండు తులాల బంగారు నగలున్న బ్యాగును వారికి కేటాయించిన సేఫ్టీ గదిలో దాచారు. అదే గదిలో వధువుకు వచ్చిన గిఫ్ట్‌లను ఓ పక్కకు సర్దారు. తీరా డబ్బున్న బ్యాగు వైపు చూడగా అది కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి కల్యాణ మండపం మొత్తం గాలించారు. గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆ గదిలోంచి బయటకు వచ్చినట్లు తోటి వారు చెప్పడంతో తెలుసుకున్న బాధితులు విషయాన్ని నాల్గవ పట్టణ పోలీసులకు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు. కాగా ఓ వ్యక్తి మండపం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. అతనే దొంగా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. పెళ్లికి ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు మాయం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు.

దొంగల జాబితాతో..

కల్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడే దొంగల జాబితాను వెలికి తీసిన పోలీసులు దొంగను పట్టుకునేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. గతంలో ఇలాంటి నేరాలతో సంబంధాలున్న వారిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. కల్యాణ మండపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి ఫొటోను సేకరించారు. ఈ ఫొటో ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు.

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)