Breaking News

జ్యోతికి మరో స్వర్ణం

Published on Fri, 05/19/2023 - 06:10

విశాఖ స్పోర్ట్స్‌ : జాతీయ ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో విశాఖ అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజీ మరోస్వర్ణాన్ని కై వసం చేసుకుంది. రాంచీలోని బిర్సా ముండా స్టేడియంలో గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల పరుగును 23.42 సెకన్లలో గమ్యాన్ని చేరి జ్యోతి (ఆంధ్రప్రదేశ్‌) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. అర్చన సుసేన్‌ (తమిళనాడు) 23.61సెకన్లలోనూ, హిమాని చందల్‌ (మధ్యప్రదేశ్‌) 24.33 సెకన్లలో పూర్తి చేసి వరుసగా ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. సిమ్రాన్‌దీప్‌ కౌర్‌ (ఢిల్లీ), దనేశ్వరి (కర్నాటక), అంజలి(కేరళ), మధుమిత (ఒడిస్సా), శుభమ్‌ (హర్యానా) వరుసగా నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. ప్రిలిమ్స్‌ హీట్‌లో జ్యోతి 23.47సెకన్లలో పూర్తి చేసి ఫైనల్స్‌కు క్వాలిఫై అయింది. జాతీయ రికార్డు హోల్డర్‌ జ్యోతి బుధవారం జరిగిన వంద మీటర్ల హార్డిల్స్‌ను 12.89 సెకన్లలోనే పూర్తి చేసి స్వర్ణం సాధించిన విషయం విధితమే. దీంతో జ్యోతి పాల్గొన్న రెండు అంశాల్లో విజేతగా నిలిచి రెండు స్వర్ణాలందుకుంది. దీంతో జూలై 12–16 వరకు బాంకాంక్‌లో జరిగే ఆసియన్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌పై దృష్టి పెట్టింది.

Videos

ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?

క్యారెక్టర్ లేని వారికే ఆలయాల చైర్మన్ పదవులు

గోల్డ్ లవర్స్ కు షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు

రఘురామరాజుకు కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్

నీ నక్క తెలివితేటలు... జగన్ దెబ్బకు ఢిల్లీలో దాక్కున్నావ్...

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్

చర్చలు కాదు.. యుద్ధానికి రెడీ.. UAE సంచలన ప్రకటన

విజయ్ ఆస్తులు, అప్పులు ఎంత? తెలిస్తే షాక్ అవుతారు

Breaking News : పెట్రోల్ ధరలు పెరగలేదు

జగన్ కట్టిన ఇళ్లపై బాబు వీడియో చూపించి మరి ఇచ్చిపడేసిన నాగమల్లేశ్వరి

Photos

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)

+5

'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘బ్యాండ్‌ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)