Breaking News

మహిళా సాధికారతకు సీఎం కృషి

Published on Wed, 03/29/2023 - 01:24

● రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ● అడ్డతీగల, గంగవరంలో వైఎస్సార్‌ ఆసరా చెక్కుల అందజేత

అడ్డతీగల/గంగవరం: రాష్ట్రంలో మహిళల సాధికారతకు సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. అడ్డతీగల, గంగవరం మండల కేంద్రాల్లో వైఎస్సార్‌ ఆసరా మూడో విడత చెక్కులను మంగళవారం ఆమె అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో మూడు దఫాలతో కలిపి ఇప్పటివరకూ 4,761 స్వయం సహాయక సంఘాల్లోని 47,617 మంది అక్క చెల్లెమ్మలకు రూ.60 కోట్లు అందజేశారని చెప్పారు.మూడవ విడతలో ఒక్క అడ్డతీగల మండలంలో 505 స్వయం సహాయక సంఘాలకు రూ.2.18 కోట్లు, గంగవరం మండలంలో 330 మహిళా సంఘాలకు మూడు విడతల్లో సుమారు రూ.మూడు కోట్లు అందజేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా గంగవరంలో డ్వాక్రా సభ్యులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అడ్డతీగలలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బత్తుల సత్యనారాయణ,జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కారు రాంబాబు, ఎంపీపీ బొడ్డపాటి రాఘవ,జెడ్పీటీసీ మద్దాల వీర్రాజు, వైస్‌ ఎంపీపీలు కరణం వీర వెంకట సత్యనారాయణ,గంధం బాలసుబ్రహ్మణ్యం,ఎంపీడీవో కె.బాపన్నదొర,సెర్ప్‌ ఏపీఎం దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. గంగవరంలో జరిగిన సమావేశానికి ఎంఎంఎస్‌ అధ్యక్షురాలు శారపు పావని అధ్యక్షత వహించారు. తహసీల్దార్‌ శ్రీమన్నారాయణ, ఎంపీడీవో బి.శ్రీనివాసులు, వెలుగు ఏపీడీ అల్లాడి శ్రీనివాసరావు, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం, వైస్‌ ఎంపీపీలు కుంజం గంగాదేవి, కె.రామతులసి, కోఆప్షన్‌ సభ్యుడు ప్రభాకర్‌, సర్పంచ్‌ అక్కమ్మ, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్‌ అప్పలరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)