Breaking News

మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు

Published on Tue, 10/08/2024 - 03:21

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌ సీట్‌ సాధించాలన్న లక్ష్యంతో ఏపీలో వేలాది విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి 500 నుంచి 600 మార్కులు తెచ్చుకున్నా చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి కొత్త కళాశాలలు రాకుండా, సీట్లు పెరగకుండా అడ్డుపడి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.

దీంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకంటే మన పిల్లలు 150 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ఎంబీబీఎస్‌ సీటు దక్కక మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్‌ సీట్లను అక్కడి ప్రభుత్వం పెంచడంతో బీసీ–ఏ విభాగంలో రెండో దశ కౌన్సెలింగ్‌ ముగిసే సమయానికి 420 స్కోర్‌ చేసిన వారికి కూడా ఎంబీబీఎస్‌ ప్రభుత్వ కోటా సీట్‌ దక్కింది. అదే ఏపీలో 568 మార్కుల వద్దే ఆగిపోయింది. అంటే అక్కడితో పోలిస్తే ఏపీలో కటాఫ్‌ 148 మార్కులు ఎక్కువ. 

బీసీ–సీ విభాగంలో 142, బీసీ–డీలో 103, ఓసీల్లో 101 చొప్పున తెలంగాణకంటే  ఏపీలో కటాఫ్‌ ఎక్కువగా ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం కోసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన ఐదు మెడికల్‌ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంది. పులివెందుల కళాశాలకు అనుమతులు వచ్చి సీట్లు మంజూరైనా.. ఆ సీట్లు వద్దంటూ ప్రభుత్వమే ఎన్‌ఎంసీకి లేఖ రాసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్‌ సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారు. బాబు ప్రభుత్వం చేసిన ఆ పాపం విద్యార్థులకు శాపంగా మారింది.

14 వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం 
ఎంబీబీఎస్‌ కన్వినర్‌ కోటా సీట్లలో 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్‌ పొందిన విద్యార్థులకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం కల్పించారు. తొలి 2 కౌన్సెలింగ్‌ల్లో సీట్‌ పొంది, కళాశాలల్లో రిపోర్ట్‌ చేసిన విద్యార్థులు గడువు లోగా ఎగ్జిట్‌ అవ్వవచ్చని హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఎగ్జిట్‌ అయిన వారిని తదుపరి కన్వినర్‌ కోటా కౌన్సెలింగ్‌లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కేవలం యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు అనుమతిస్తామని తెలిపారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)