Breaking News

టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది: పాక్‌ మాజీ కెప్టెన్‌

Published on Wed, 08/28/2024 - 20:17

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చీఫ్‌గా జై షా నియామకాన్ని పాక్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) వ్యతిరేకించడం లేదని.. చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా తప్పక తమ దేశానికి వస్తుందని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలితో పీసీబీకి ఈ మేరకు అవగాహన కుదిరిందని చెప్పుకొచ్చాడు.

పాక్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025
కాగా 2017 తర్వాత తొలిసారి చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్‌ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఐసీసీపైనే భారం వేసిన పాక్‌ బోర్డు
ఈ క్రమంలో హైబ్రిడ్‌ విధానంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీకి ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని.. అందుకు తగ్గట్లుగానే టీమిండియా మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఎంపిక చేయబోతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్‌ బోర్డు మాత్రం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా తమ దేశంలోనే నిర్వహిస్తామని.. ఆ జట్టును తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ బాస్‌గా నియమితుడు కావడంతో పాక్‌ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన రషీద్‌ లతీఫ్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు.

సగం ప్రక్రియ పూర్తైంది
‘‘జై షా నియామకాన్ని పీసీబీ ఏమాత్రం వ్యతిరేకించడం లేదు. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనే అనుకుంటున్నా. ఒకవేళ టీమిండియా పాకిస్తాన్‌ వస్తే.. అందుకు జై షానే కారణం అనుకోవచ్చు. భారత ప్రభుత్వ మద్దతుతో అతడు బోర్డును ఒప్పిస్తాడు. ఇందుకు సంబంధించి సగం ప్రక్రియ పూర్తైంది. టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది’’ అని రషీద్‌ లతీఫ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా సంచలనానికి తెరతీశాడు. 

కాగా 1996 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇక భారత జట్టుకు అక్కడికి వెళ్లి పదహారేళ్లకు పైనే అయింది. 2008లో చివరగా టీమిండియా పాక్‌లో పర్యటించింది. 2013 తర్వాత ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు తెరపడింది.
చదవండి: ‘రోహిత్‌ 59 శాతం.. విరాట్‌ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్‌?’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)