Breaking News

అల్లు అర్జున్‌ను టార్గెట్‌ చేసిన మరో జనసేన నేత

Published on Wed, 08/28/2024 - 20:06

సాక్షి, కృష్ణా జిల్లా: జనసేన నేతలు అల్లు అర్జున్‌ను టార్గెట్‌ చేస్తూ చెలరేగిపోతున్నారు. ఆయనపై మరో జనసేన నేత నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్‌ ఓ కమెడియన్‌ అంటూ ఆ పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు నోటి దురుసు ప్రదర్శించారు. ‘‘చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండతో ఇండస్ట్రీకి వచ్చావు. మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయి నీకు లేదు. నీ బాబు అల్లు అరవింద్ పిల్లికి బిక్షం కూడా పెట్టడు. నీ స్థాయిని మరచి మాట్లాడుతున్నావు’’ అంటూ వ్యాఖ్యానించారు.

‘‘చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లుకడిగి నీళ్లు నెత్తిన చల్లుకుని తప్పుని సరిచేసుకో. అలా చేయని పక్షంలో డిసెంబర్ లో రిలీజ్ అయ్యే నీ సినిమాలను అడ్డుకుంటాం. గన్నవరం నియోజకవర్గంలో నీ సినిమా ఒక్క థియేటర్‌లోకూడా విడుదలయ్యే పరిస్థితి ఉండదు.’’ అని చలమశెట్టి హెచ్చరించారు.

కాగా, ‘అల్లు అర్జున్‌ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్‌ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’  అంటూ తాడేపల్లిగూడెం  జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)