Breaking News

ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!

Published on Tue, 05/14/2024 - 08:23

వరి పంట పండించటంలోనే కాదు, పంటను నూర్పిడి చేసి ఆరుబయట కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవటంలోనూ రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కళ్ళాల్లో వరి ధాన్యం తడిచిపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్లాల్లో పంట కళ్లెదుటే నీటిపాలవ్వకుండా రక్షించుకోవటానికి రైతులు ఎవరికి వారు తమ కళ్లం దగ్గరే నిర్మించుకోదగిన ఓ ఫ్లాట్‌ఫామ్‌ గురించి సింగరేణి మాజీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం. శ్రీరామ సూచిస్తున్నారు.

ఇది కళ్లం/పొలంలోనే నిర్మించుకునే శాశ్వత నిర్మాణం. నలు చదరంగా ఉండే పొలంలో అయితే, ప్లస్‌ ఆకారంలో, సుమారు 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగల మంచెను పర్మనెంటుగా వేసి ఉంచాలి. దీర్ఘ చతురస్రాకార పొలమైతే, పొడుగ్గా దీన్ని నిర్మిస్తే చాలు. దీనికి, పొలం గట్లపై ఉండే 2 లేక 3 తాడి చెట్లు కొట్టి వేస్తే చాలు. తాటి మొద్దులను 5 అడుగుల ముక్కలుగా కోసి, భూమిలోకి 2 అడుగులు, భూమి పైన 3 అడుగులు ఎత్తున ఉండేలే చూడాలి. రెండు మొద్దుల మధ్య దూరం 6 అడుగులు ఉంటే చాలు.

దీని మీద జీఐ చెయిన్‌ లింక్‌ ఫెన్స్‌ లేదా మెటల్‌ ఫెన్స్‌ లేదా రోజ్‌ హెడ్‌ నెయిల్స్‌ సహాయంతో వ్యవసాయ సీజన్‌ మొదట్లోనే అమర్చి ఉంచుకోవాలి. అకాల వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన సమయంలో ఈ మంచెపైన టార్పాలిన్‌ షీట్‌ పరచి, దానిపైన ధాన్యాన్ని ఎత్తిపోసుకోవాలి. ధాన్యంపైన కూడా టార్పాలిన్‌ షీట్‌ కప్పి చైన్‌లింక్‌ ఫెన్స్‌కి తాళ్లలో గట్టిగా కట్టాలి. ఎంతపెద్ద గాలి అయినా, తుపాను అయినా, 2 అడుగుల లోపు వరద వచ్చినా, ధాన్యం తడవకుండా ఇలా రక్షించుకోవచ్చు. ధాన్యం ధర తగ్గించి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.

చిన్న కమతాల్లో అయితే అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవటానికి రైతు, అతని భార్య ఈ పని చేసుకోవచ్చు లేదా ఇద్దరు మనుషులు చాలు. ఈ మంచెకు పొలం విస్తీర్ణంలో ఒక శాతం అంటే ఎకరానికి ఒక సెంటు స్థలాన్ని కేటాయిస్తే చాలు. ఆ స్థలం కూడా వృథా కాదు. దీన్ని పందిరిగా వాడుకుంటూ బీర, ఆనప, చిక్కుడు తదితర తీగ జాతి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.

చిత్రంలో సూచించిన మాదిరిగా మంచెను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ సూచించిన కొలతలను రైతులు తమ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎకరానికి ఒక సెంటు భూమిలో ఇలా తక్కువ ఖర్చుతో, రైతుకు తేలికగా దొరికే తాడి దుంగలతో వేదికను నిర్మించుకుంటే సరిపోతుందని శ్రీరామ (83095 77123) సూచిస్తున్నారు.

ఇవి చదవండి: పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)