Breaking News

Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ

Published on Tue, 05/14/2024 - 05:27

రాయ్‌బరేలీ: రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే, అదానీ, అంబానీల కోసం మోదీ చాలా చెమటోడ్చారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన సభలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ రాయ్‌బరేలీలో నామినేషన్‌ వేశాక రాహుల్‌ ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ‘‘ నానమ్మ ఇందిరా గాం«దీ, నాన్న రాజీవ్‌గాం«దీ, అమ్మ సోనియాగాంధీ అందరూ రాయ్‌బరేలీ ప్రజల జీవితాలను బాగుచేసేందుకు పాటుపడ్డారు. 

మా కుటుంబమంతా మీ కోసం పనిచేస్తే, మోదీ మాత్రం అదానీ, అంబానీల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. ఉపాధిహామీ పథకానికి 24 ఏళ్లకాలానికి ఖర్చయ్యే మొత్తానికి సరిసమానమైన బడాపారిశ్రామికవేత్తల రూ.16 లక్షల కోట్ల రుణాలను మోదీ ఒక్కదెబ్బతో మాఫీచేశారు. మోదీ హయాంలో రైతులు, నిరుద్యోగ యువత సమస్యలను జాతీయ మీడియా ఉద్దేశపూర్వకంగా చూపించలేదు. పారిశ్రామికవేత్తల కుటుంబాల ఆడంబర వివాహాలకే అగ్రతాంబూలం ఇచ్చాయి. ఆ వేడుకలనే ప్రసారంచేశాయి’’ అని ఆరోపించారు.  

పెళ్లి ఎప్పుడంటే? 
సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన ప్రచారసభలో రాహుల్‌ మళ్లీ అదే ప్రశ్నను ఎదుర్కొన్నారు.  రాహుల్‌ మాట్లాడేటప్పుడు సభావేదికపై సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. ‘నిన్ను వీళ్లేదో ప్రశ్న అడుగుతారట. సమాధానం చెప్పు’ అని ప్రియాంక చెప్పగా, ఏంటా ప్రశ్న అని రాహుల్‌ సభికులను అడిగారు. పెళ్లి ఎప్పుడు? అని ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు రాహుల్‌ ఈసారి కొత్త సమాధానం చెప్పారు. ‘‘తొందరపడాలిక. త్వరలోనే చేసుకుంటా’’ అని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

గతంలో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ‘‘ ఇన్నాళ్లు ఎందుకో పెళ్లి గురించి అంతగా పట్టించుకోలేదు’, ‘ పెళ్లి మీదకు మనసు పోలేదు’, ‘ మీరే అమ్మాయిని చూడండి’, ‘ అమ్మకు నచి్చతే ఓకే’ అంటూ వేర్వేరు సమాధానాలు చెప్పిన రాహుల్‌ సోమవారం ఇలా కొత్త సమాధానం చెప్పారు. తర్వాత ప్రియాంకను పొగిడారు.‘‘ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఎట్టకేలకు రాయ్‌బరేలీకి వచ్చా. కానీ ప్రియాంక మాత్రం మొదట్నుంచీ రాయ్‌బరేలీలో ప్రచార బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటోంది. ఆమెకు నా కృతజ్ఞతలు’ అని ఆమెను అభినందించారు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)