Breaking News

విజేత సూపర్‌ మార్కెట్‌ సీజ్‌

Published on Sat, 04/25/2020 - 16:20

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్త చర్యలు తీసుకోని సూపర్‌ మార్కెట్‌లను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో చందానగర్‌కు చెందిన విజేత సూపర్‌ మార్కెట్‌ను శనివారం అధికారులు సీజ్‌ చేశారు. సూపర్‌ మార్కెట్‌లో భౌతిక దూరం పాటించకుండా ఒకేసారి ఎక్కుమందిని లోపలికి పంపడం, ఒకే దగ్గర అధిక సంఖ్యలో కస్టమర్స్‌ ఉండటంతో సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వాల్‌మార్ట్‌ ‘బెస్ట్‌ ప్రైస్‌’ సూపర్‌ మార్కెట్‌లో అధి​కారులు తనిఖీలు చేశారు. సీజ్‌ చేసినట్టు వచ్చిన వార్తలను వాల్‌మార్ట్‌ ఇండియా తోసిపుచ్చింది. అధి​కారులు తనిఖీలు మాత్రమే చేశారని వెల్లడించింది. లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసింది.

అయితే అధికారుల తీరుపై సూపర్‌ మార్కెట్‌ యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు అనువుగా నిత్యవసర సరుకులను అందిస్తున్న తమపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని, దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ గడువును తెలంగాణ ప్రభుత్వం మే 7 వర​కు పొడిగించిన సంగతి తెలిసిందే.

కిరాణా వర్తకుడికి కరోనా పాజిటివ్‌

Videos

1800 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్

రేపు కల్లి తండాకు మాజీ సీఎం వైఎస్ జగన్

లాస్ట్ పంచ్.. బ్రహ్మోస్ మిస్సైల్ తో దెబ్బ అదుర్స్..

నాగార్జున సాగర్ కు అందగత్తెలు

భారత్ సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఆపరేషన్ సిందూర..

తూటా పేలిస్తే క్షిపణితో బదులిస్తామని పాక్ కు ప్రధాని మోదీ హెచ్చరిక

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ

పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో

ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు

Photos

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్‌ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)