పాక్ దాడుల వెనుక టర్కీ, చైనా హస్తం..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పఠాన్కోట్ లో మళ్ళీ పేలుడు కలకలం
Published on Tue, 01/05/2016 - 15:27
పంజాబ్: పఠాన్కోట్ భారత వైమానిక స్థావరం బయట మంగళవారం మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూండగానే మళ్లీ పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కలకలం రేపింది. దీంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగివున్నారనే దానిపై మరింత ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఉగ్రవాదులు అసలు భారత సైనిక దుస్తుల్లో పఠాన్-కోట్ ఎయిర్-బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపలి మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవారే ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా లాంటి అంశాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ ఎత్తున పేలుడు శబ్దం రావడంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగి వున్నరానే దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. గత మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
#
Tags : 1