ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు

Published on Wed, 09/18/2019 - 04:08

విజయ్‌ దేవరకొండ ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు అయ్యారు. దీన్నిబట్టి అతను ఏ స్థాయిలో తన ప్రేయసి పట్ల ప్రేమ కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ విజయ్‌ ప్రేయసి ఎవరంటే.. ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్‌ ట్రెసా, ఇజాబెల్లా లెయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు. ఈ వెండితెర ప్రేమకథకు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కేఎస్‌ రామారావు సమర్పణలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్‌ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సున్నితమైన కథాంశంతో క్రాంతి మాధవ్‌ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ‘వరల్డ్‌ ఫేయస్‌ లవర్‌’ మా కథకు తగ్గ టైటిల్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నాం. ఈ నెల 20న ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి, ఆర్ట్‌: సాహి సురేశ్‌.

Videos

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పెంచలయ్య హత్యపై నెల్లూరు డీఎస్పీ శ్రీనివాస్

ఏపీకి రెడ్ అలర్ట్ దూసుకొస్తున్న దిత్వా

నా ఫోన్ లాక్కొని రోజంతా.. విచారణ పేరుతో వేధిస్తున్నారు

ఇంట్లోకి చొరబడి తల్లి, కుమారుడిపై హత్యాయత్నం

PA సతీష్ కు మంత్రి సపోర్ట్.. కూటమిపై పుష్పశ్రీవాణి ఫైర్

మీకు అధికారం ఇచ్చినందుకు రైతులకు బాగా బుద్ది చెప్పారు..

ధమాకా 2 కన్ఫర్మ్!

బస్సు సీటు కోసం ప్రయాణికుడిని చితకబాదిన మహిళలు

పెంచలయ్య హత్య కేసులో పురోగతి

Photos

+5

హీరోయిన్ నివేదా థామస్ బ్రదర్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తెలుగు స్టార్ హీరోలంతా కలిసి పార్టీ చేసుకుంటే? (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో కరీబియన్ ట్రిప్‌ ఎంజాయ్ చేస్తోన్న లయ (ఫొటోలు)

+5

మేకప్ లేకుండా ఉదయాన్నే ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

విశాఖలో సినీ నటి సంయుక్త మీనన్‌ సందడి (ఫొటోలు)

+5

ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)

+5

వణికిస్తున్న ‘దిత్వా’ తుపాను (ఫొటోలు)

+5

'గుస్తాఖ్ ఇష్క్' చిత్రం ప్రీమియం షోలో బాలీవుడ్ నటుడులు సందడి (ఫొటోలు)

+5

'సకుటుంబానాం' మూవీ ట్రైలర్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌తో అదరగొట్టిన మోడల్స్‌ (ఫొటోలు)