Breaking News

మహేశ్‌తో 'జనగణమన' నా డ్రీమ్‌

Published on Tue, 06/23/2020 - 17:21

హైదరాబాద్‌: డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన కలల ప్రాజెక్ట్‌ ‘జనగణమన’ను అతి త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని, ప్యాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తాని వెల్లడించారు. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో ‘జనగణమన’ తెరకెక్కించాలని చాలా ప్రయత్నించినట్లు తెలిపారు. ఫాదర్స్‌డే సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పూరి ఈ విషయాన్ని తెలిపారు. దేశానికి కావాల్సిన సినిమా అని అదేవిధంగా తను తప్పకుండా తీయాల్సిన సినిమా అని పేర్కొన్నారు.  దేశభక్తితో కూడిన ‘జనగణమన’ చిత్రం దేశంలోని ప్రతీ ఒక్కరు చూసే విధంగా ఉంటుందన్నారు. (సితు పాపను ఓడిస్తూ తాను ఓడిపోతూ)

అంతేకాకుండా ఈ చిత్రం మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని వివరించారు.  అయితే ఈ చిత్రంలో నటించే హీరో ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.  దీనిగురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన గల్వాన్‌ ఘటనపై ఓ కథ రాస్తున్నట్లు పూరి జగన్నాథ్‌ తెలిపారు. మిలటరీ అంటే తనకు ఎంతో ఇష్టమని, సైనికులు చేస్తున్న త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని వివరించారు. (నాన్న అంటే ప్రేమ.. ధైర్యం)

పోకిరి, బిజినెస్‌మేన్‌ చిత్రాల తర్వాత మహేశ్‌ బాబుతో ‘జనగణమన’ చిత్రం చేయాలని పూరి భావించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్ర కథ నచ్చినప్పటికీ పూర్తి స్క్రిప్ట్‌పై మహేశ్‌ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. పలుమార్లు స్క్రిప్ట్‌ను మార్చినప్పటికీ మహేశ్‌ ఒప్పుకోకపోవడంతో ‘జనగణమన’ను పూరి పక్కకు పెట్టారనే వార్తలు వచ్చాయి. ఇస్మార్ట్‌ శంకర్‌తో విజయం అందుకున్న పూరి ప్రస్తుతం విజయ్‌దేవరకొండతో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. (చార్మి బర్త్‌డే : పూరీ ఎమోషనల్‌ ట్వీట్‌)

అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో ‘జనగణమన’ స్క్రిప్ట్‌ను మరింత మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది. విజయ్‌ చిత్రం తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక పూరి-మహేశ్‌ కాంబోలో మరో సినిమా రావాలన్ని సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ తెగ ఆశపడుతున్నారు. మరి అన్ని వివాదాలను పక్కకుపెట్టి తన కలల ప్రాజెక్ట్‌ ‘జనగణమన’ను మహేశ్‌తో తీస్తారా? లేక వేరే హీరోతో ఈ చిత్రాన్ని తెరకెక్కొస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.  (ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి)

Videos

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

మిల్లా మ్యాగీ వైదొలగడం పట్ల స్పందించిన కేటీఆర్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)