Breaking News

మహేశ్‌ డైరెక్షన్‌లో స్వీటీ చిత్రం?

Published on Fri, 06/12/2020 - 20:58

‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’, ‘భాగమతి’ వంటి సూపర్‌డూపర్‌హిట్‌ చిత్రాలతో ఫుల్‌ క్రేజ్‌ సాధించిన స్టార్‌ హీరోయిన్‌ స్వీటీ అనుష్క. ఇప్పటికే దక్షిణాదిన భారీ బడ్జెట్‌తో కూడిన‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. ప్రస్తుతం హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనేదానిపై దర్శకనిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. (సెన్సార్‌ పూర్తి.. సస్పెన్స్‌ అలానే ఉంది!)

అయితే ‘నిశ్శబ్దం’ సినిమా గురించి కాస్త పక్కన పెడితే.. అనుష్క మరో భారీ లేడీ ఓరియెంట్‌ చిత్రానికి కమిట్‌ అయిందని సమాచారం. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ నిర్మించనుందని టాక్‌. ఇప్పటికే యువీ క్రియేషన్స్‌లో మిర్చి, భాగమతి చిత్రాలను స్వీటీ చేసిన విషయం తెలిసిందే. సందీప్‌ కిషన్‌తో ‘రారా కృష్ణయ్య’ తీసిన పి. మహేశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Videos

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)