Breaking News

బిగ్‌బీకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’

Published on Sun, 12/29/2019 - 17:54

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్‌ సతీమణి జయాబచ్చన్‌, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఈ పురస్కారాన్ని అమితాబ్‌ స్వీకరించాల్సినప్పటికీ అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయారు. అప్పుడు ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘జ్వరంతో బాధపడుతున్నాను. ప్రయాణాలు చేయొద్దని వైద్యులు చెప్పారు. దిల్లీలో జరగబోయే జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాను. ఇది దురదృష్టకరం. విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో అమితాబ్‌కు పురస్కారాన్ని అందజేశారు.

(చదవండి : బచ్చన్‌ సాహెబ్‌)

భారతీయ సినిమా రంగానికి విశిష్టసేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా అమితాబ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.  భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి  ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి (2019) గాను అవార్డు అమితాబ్‌ బచ్చన్‌ను వరించింది.

Videos

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)