విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..
Breaking News
కాంగ్రెస్ ఓటమిపై పవన్ ప్రభావం లేదు
Published on Mon, 05/19/2014 - 14:14
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పవన్ కల్యాణ్ ప్రభావం ఏమాత్రం లేదని ఆయన సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకత కనిపించిందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
కాగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ రుణాలు మాఫీలు అవుతాయో....లేదో అనే విషయంలో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానని, ఆ ఫైలుపైనే తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
80 లక్షల మంది రైతులకు రూ.80వేల కోట్ల రుణాలు మాఫీ కావల్సి ఉందని రఘువీరా అన్నారు. ఇప్పటివరకూ ఈ విషయంపై గవర్నర్ కానీ... ప్రభుత్వాధికారులు కానీ బ్యాంకర్లతో మాట్లాడలేదన్నారు. రుణమాఫీ కాకుంటే రైతులకు పెట్టుబడికి ఇబ్బంది ఏర్పడి వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. అదే అంశాన్ని గవర్నర్, చంద్రబాబు నాయుడుకు గుర్తు చేస్తున్నామని రఘువీరా అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ, పవన్ కల్యాణ్, చిరంజీవి, రఘువీరారెడ్డి, congress, bjp, pavan kalyan, chiranjeevi, raghuveera reddy
Tags : 1