Breaking News

పార్టీ పేరు మారుద్దామా!

Published on Sun, 08/23/2015 - 01:24

తెలుగుదేశం పేరు మార్పుపై చర్చ..నిర్ణయం వాయిదా
విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను టార్గెట్‌గా విచారణలు

 
విజయవాడ బ్యూరో: తెలుగుదేశం పార్టీ పేరు మార్చడంపై ఆ పార్టీ నేతల సమావేశం తర్జనభర్జన పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. పేరు మార్చినంత మాత్రాన జాతీయపార్టీగా గుర్తింపు రాదన్న విషయం గమనించి తాత్కాలికంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు.జాతీయ పార్టీగా గుర్తింపు ఇప్పట్లో సాధ్యం కాదని, 2019 ఎన్నికల నాటికి విస్తరించి జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చినప్పటికీ పేరు మార్చాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

ఏపీ, తెలంగాణలతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడి శా, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని బాబు సూచించారు. బీఎస్పీ లాంటి పార్టీ జాతీయ పార్టీగా చలామణి అవుతున్నా ఒకటి, రెండు రాష్ట్రాలకే పరిమితమైందని చెబుతూ పేరు మార్చాల్సిన అవసరం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. టీడీపీ జాతీయ, తెలంగాణ, ఏపీ రాష్ట్ర కమిటీలను అసెంబ్లీ సమావేశాల తర్వాత నియమించాలని నిర్ణయించారు.  సమావేశంలో కళా వెంకట్రావు మాట్లాడుతూ లోకేశ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించాల్సిందిగా కోరారు.

 విమర్శలు చేసే వారిని లక్ష్యంగా
టీడీపీతోపాటు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారిని టార్గెట్ చేయాలని సమావేశం నిర్ణయించినట్టు పార్టీ నేతలు తెలిపారు. ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైన విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను వదిలిపెట్టొద్దని ఎమ్మెల్యేలు చెప్పగా అవసరాన్ని బట్టి విచారణలు చేయిద్దామని చంద్రబాబు సమాధానమిచ్చారు.సినీనటుడు పవన్ కల్యాణ్‌పై దూకుడుగా వెళ్లవద్దని సహచర నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు.తాను పవన్‌తో మాట్లాడతానని చెప్పారు.

టార్గెట్ విపక్షం 
శాసనసభ వర్షాకాల సమావేశాల్లో విపక్ష వైఎస్సార్‌సీపీ, ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పని చేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు. రాజధానికి భూసేకరణ, ఓటుకు కోట్లు కేసు, ప్రత్యేక హోదా, నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి, కడప నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు బాలికల ఆత్మహత్య అంశాలపై ప్రతిపక్షం నిలదీసే అవకాశం ఉన్నందున జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగాలని చెప్పారు. ఈ నెల 25న ప్రధాని నరేంద్రమోదీని కలిసి ప్రత్యేకహోదా, రాష్ట్రానికి నిధుల విడుదల గురించి కోరనున్నామని చంద్రబాబు నేతలకు చెప్పారు.
 

Videos

బీజేపీ ఆఫీసులపై కాంగ్రెస్ శ్రేణుల ముట్టడి

తమిళ ప్రజలను కృతజ్ఞతలు చెప్పిన విజయ్

YS Jagan : ఎన్. జనార్ధన రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశాడు..

YS Jagan: ఎవడెవడు కాలేజీలు తీసుకున్నాడో వాళ్ళకి చెబుతున్నా...

YS Jagan : విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‎మెంట్ లేదు

సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు

జగన్ పంచ్.. నీ పనైపోయింది.. ఆశలు పెట్టుకోకు

వామ్మో,లక్‌ అంటే పులి రాజాదే... లేదంటే!

IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!

అసలు అప్పు లక్ష.. వడ్డీతో 74 లక్షలు..

Photos

+5

జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం (ఫొటోలు)

+5

ఫుడ్‌.. షాపింగ్‌.. ఇంకేం కావాలంటున్న రెజీనా! (ఫోటోలు)

+5

వైఎస్సార్సీపీ సమరభేరి.. కోటి సంతకాలకు జెండా ఊపిన వైఎస్‌ జగన్ (చిత్రాలు)

+5

ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు.. ఈవెంట్‌ ఫోటోలు

+5

ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్‌ రాజు (ఫోటోలు)

+5

'డేవిడ్‌ రెడ్డి'గా మంచు మనోజ్‌.. గ్లింప్స్‌ వేడుకలో యూనిట్‌ ( ఫోటోలు)

+5

హీరోయిన్ రష్మిక.. గర్ల్స్ గ్యాంగ్‌తో శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే మై హార్ట్‌బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)

+5

వంతారలో మెస్సీ.. వన్య ప్రాణులతో సందడి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (చిత్రాలు)