Breaking News

ఈ సినిమాలో నితిన్‌ని చూసి ఆశ్చర్యపోయాను: నాని

Published on Sun, 11/29/2026 - 00:20

‘‘అలియాస్‌ రుక్మిణి’లో నితిన్  చాలా ప్రత్యేకంగా చేశాడు. 21 ఏళ్ల నుంచి తనని చూస్తున్న నేనే ఈ సినిమాలో తనని, తన నటన చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను’’ అని హీరో, నిర్మాత నాని తెలిపారు. నితిన్ , ఆఫియా సయ్యద్‌ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం ‘అలియాస్‌ రుక్మిణి’. మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మించిన ఈ మూవీ డిసెంబరు 4న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా విడుదలకు ముందు ఉండే టెన్షన్ , వేరే ఆలోచనలు ఏవీ లేవు. ఈ సినిమాని మీ అందరితో కలిసి చూసేందుకు వేచి చూస్తున్నాను.

డిసెంబరు 3 నుంచే ప్రీమియర్స్‌ ఉంటాయి... అక్కడి నుంచే ఈ మూవీ సెలబ్రేషన్స్  స్టార్ట్‌ అవుతాయి. నేను కథ విన్నప్పుడు కంటే సినిమాని చాలా అద్భుతంగా తీశారు మురళీకాంత్‌. మా అక్క దీప్తి సినిమాకి సంబంధించిన అన్నింట్లోనూ స్ట్రాంగే’’ అన్నారు. నితిన్  మాట్లాడుతూ– ‘‘ఒక నటుడిగా రెండేళ్లుగా ఒత్తిడిలో ఉన్నాను. సరైన కథలు రావట్లేదు, సినిమా పడట్లేదు అని చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. ‘అలియాస్‌ రుక్మిణి’ షూటింగ్‌ ఆగస్టు 17న స్టార్ట్‌ అయింది. అప్పట్నుంచి ప్రశాంతంగా నిద్రతున్నా. ఎలా ఆలోచించాలో, ఎలాంటి చిత్రాలు చేయాలో ఈ సినిమా నాకు నేర్పింది.

మా శివగామి దీప్తిగారు. 2003లో ‘దిల్‌’ సినిమాకి రాజుగారు ఎలా ప్లానింగ్‌తో పని చేశారో దీప్తిగారిలో అదే ఉత్సాహం చూశాను. డిసెంబరు 4న మురళి పేరు బాగా వినిపిస్తుంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక దేవుడిలా నాని ఈ సినిమా కథని నా చేతిలో పెట్టాడు. ఈసారి హిట్‌ ఇస్తున్నా... బరాబర్‌ హిట్‌ ఇస్తున్నా’’ అని చెప్పారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘అలియాస్‌ రుక్మిణి’ ట్రైలర్‌ చూడగానే సినిమా సూపర్‌ హిట్‌ అని నాని, నితిన్ లకు మెసేజ్‌ చేశాను’’ అన్నారు. మురళీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీ ఫైనల్‌ కాపీ చూసి, నానీగారు ‘బాగా తీశావ్‌’ అని అభినందించడం మరచిపోలేను’’ అని చెప్పారు.

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)