Breaking News

ప్రపంచాన్ని వణికించిన సీక్రెట్‌ ఆపరేషన్...ఓటీటీలో ఈ సినిమా చూశారా?

Published on Thu, 11/26/2026 - 11:39

టైటిల్‌: ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫియర్
ఓటిటి వేదిక: ప్రైమ్ వీడియో

ఓ ఆలోచన వస్తే సరిపోదు. సరైన ప్రణాళికా వ్యూహం తోడై ముందుకెళితేనే ఆ ఆలోచన అనుకున్న ఆచరణలోకి వెళుతుంది.  మరీ ముఖ్యంగా దేశ గూఢచర్య వ్యవస్థలో ఈ వ్యూహం పక్కా టైమింగ్ తో కూడికుని ఉంటుంది.  అటువంటి సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ప్రతి దేశానికి ఓ గూఢచర్య వ్యవస్థ నిగూఢంగా పని చేస్తూ ఉంటుంది. వాటిలో ప్రత్యేకంగా మొదటి స్థానంలో నిలిచేది ఇజ్రాయెల్ దేశానికి చెందిన మొసాద్ గూఢచర్య వ్యవస్థ. దేశమేదైనా, ప్రాంతమేదైనా, వ్యవస్థ ఏదైనా, వ్యక్తి ఎవరైనా లక్ష్యమేదైనా సరే మొసాద్ గురి తప్పినట్లు చరిత్రలో లేదు.  పక్కా టైమింగ్ తో మొసాద్ గనక స్కెచ్ వేసి ఆపరేషన్ చేస్తే ఫలితం తగ్గేదేలేదు.  అందులో తాజాగా మోసాద్ చేసిన ఓ ఆపరేషన్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. తుపాకీలు గురి పెట్టకుండా, బుల్లెట్ పేల్చకుండా దాదాపు ఓ 5000మంది హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఉదంతం నభూతో నభవిష్యతి.  ఇటీవలే అంతర్జాతీయంగా జరిగిన ఈ వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమానే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫియర్. అసలు జరిగిన ఆ వాస్తవమేమిటి, ఈ సినిమా వృత్తాంతంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఇదీ చదవండి: పాకిస్తాన్‌ వెబ్‌ సిరీస్‌పై వివాదం.. ఇండియాలో స్ట్రీమింగ్‌ అవుతుందా?

ఇజ్రాయెల్ , లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ మధ్య దశాబ్దాలుగా తీవ్ర శత్రుత్వం కొనసాగుతోంది. అక్టోబర్ 2023లో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి, హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై నిరంతరం రాకెట్ దాడులు చేయడం ప్రారంభించింది. తమ కదలికలను ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ స్మార్ట్‌ఫోన్ల ద్వారా ట్రాక్ చేస్తోందని గ్రహించిన హెజ్బొల్లా అధినేత నస్రల్లా, ఫోన్లను వదిలేసి పాత తరం పేజర్లను, వాకీటాకీలను వాడాలని ఆదేశించారు. 

సరిగ్గా ఇదే అదనుగా చూసుకున్న మొస్సాద్, అత్యంత రహస్యంగా ఒక భారీ కుట్రకు తెరలేపింది. నకిలీ షెల్ కంపెనీలను సృష్టించి, తైవాన్ బ్రాండ్ ముసుగులో తామే ప్రత్యేకంగా తయారు చేసిన వేలాది పేజర్లను హెజ్బొల్లా కొనుగోలు చేసేలా వ్యూహాత్మకంగా అమ్మింది. ఎక్స్ రే స్కాన్లకు కూడా దొరకకుండా ఆ పేజర్ల బ్యాటరీలలో అత్యంత శక్తివంతమైన PETN పేలుడు పదార్థాలను మొస్సాద్ అమర్చింది. 2024 సెప్టెంబర్ 17న హెజ్బొల్లా నాయకత్వం నుంచి వచ్చిన అత్యవసర సందేశంలా ఒక ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ను పంపి, వేలాది పేజర్లను ఒకేసారి పేల్చేసి హెజ్బొల్లా నెట్‌వర్క్‌ను ఇజ్రాయెల్ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. 

ఇదే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫియర్ సినిమా కథ కూడా. మొసాద్ ఆపరేషన్ ను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ చిత్రంలో. ఇదో మంచి థ్రిల్లర్ సినిమా. ఇంకెందుకాలస్యం గ్రాబ్ యువర్ రిమోట్ అండ్ ట్యూన్ ఇట్ టు ప్రైమ్ వీడియో ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్.
- హరికృష్ణ, ఇంటూరు

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)