Breaking News

చదువురాని ఇంట పుట్టినా..! ఏకంగా రక్త ప్రవాహ గణితాన్నే శాసిస్తోంది!

Published on Wed, 11/25/2026 - 17:45

పర్వత పట్టణంలో పుట్టిన మాణిక్యం ఆమె. తల్లిదండ్రులు చదువు లేకపోయినా, కనీస వనరులు అందుబాటులో లేకపోయినా..ఉన్నత చదువులు చదివి పరిశోధనలు చేసే రేంజ్‌కు చేరుకుంది. ఏకంగా గణితంలోనే పరిశోధనలు చేస్తూ రక్తప్రవాహంతో ఉన్న లింక్‌ను ముడివిప్పుతూ అందర్నీ అబ్బురపరుస్తుంది. సాధారణ స్థాయి నుంచి అసాధారణ విజయాన్ని సాధిస్తూ యుతకు స్ఫూర్తిగా నిలిచింది ఈ అమ్మాయి. 

ఆ అమ్మాయే చైనాకు చెందిన  లింజీ యింగ్. ఇంట్లో సరైనా విద్యా మార్గదర్వకత్వం లేదు. తల్లిదండ్రులు కేవలం ప్రాథమిక విద్య వరకే చదువుకున్నారు. అయినా ఆమె ఫోకస్‌ అంతా చదువు మీదే ఉండేది. అదే తన జీవిత పరమావధి అన్నట్లు చదివింది. ఎక్కోడ పర్వత పట్టణంలో పెరిగిన ఆమెకు స్కూల్‌కి వెళ్లేందుకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. అయినప్పటికీ ఉన్నత పాఠశాల విద్యను అతికష్టంపై బోర్డింగ్‌ పాఠశాలలో పూర్తి చేసింది. ఫర్నిచర్‌లు తయారు చేయడమే తల్లిదండ్రుల జీవనోపాధి. 

అయినప్పటికీ వాళ్లు కూతుర్ని కళాశాలకు పంపి ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహించారు. విద్యాపరంగా ఎలాంటి సాయం చేయలేకపోయినా..చదువుకునే స్వేచ్ఛను ఇవ్వడంతో ఆమె నిరాటంకంగా ఉన్నత చదువులు చదివింది. చైనాలోని జెజియాంగ్ విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించి, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీలు సంపాదించింది.

ఆ తర్వాత డాక్టరేట్‌ అధ్యయనం కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ ప్రముఖ గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ పెంగ్టావో సన్‌ మార్గదర్శకంలో గణితంలో పరిశోధనలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది. లింజీయింగ్‌ ఫ్లూయిడ్-స్ట్రక్చర్ ఇంటరాక్షన్‌పై పరిశోధనను ఎంచుకుని రక్తప్రవాహాన్ని అనుసరించడంలో గణితం ఎలా సహాయపడుతుందో రీసెర్చ్‌ చేస్తోంది. ఇలాంటి పరిశోధనలకు ఎంతోప్రాముఖ్యత ఉంది ఎందుకంటే కష్టంగా లేదా ఖర్చుతో కూడుకున్న సంక్లిష్ట భౌతిక వ్యవస్థలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు  ఇంజనీర్లు కంప్యూటర్ సిమ్యులేషన్‌లను ఉపయోగిస్తారు. 

ఈ పరిశోధనలకు గానూ వరుస సంవత్సరాలలో పలు ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు కూడా అందుకుందామె. చివరగా ఆమె యువతకు ఒంటిరిగా పరిశోధనలకు ప్రయత్నించొద్దని..తగిన మద్దతు, సరైన ప్రొఫెసర్‌ సలహాలు సూచనలు అవసరమని  సూచిస్తుంది. అలాగే అకడమిక్‌ సలహాదారులు, ఇతర ప్రొఫెసర్లతో సత్సంబంధాలు రీసెర్చ్‌కు ఎంతగానో ఉపకరిస్తాయని అంటోంది. అలాగే మనకు విద్య లేదా వృత్తిపరమైన మార్గదర్శకం అందించేవారు లేరని భయపడకూడదని, సన్నహితులు లేదా స్నేహితుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు సాగాలే తప్ప ఆగిపోకూడదని అంటోంది.

ఇదీ చదవండి: కజియా లిజ్ మెజోని చూస్తే గర్వంగా ఉంది!

 

#

Tags : 1

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)