Breaking News

రూ. 50 లక్షల జీతం వదిలి.. ఐఐఎం బెంగళూరు నుంచి సాధ్విగా, తోడుగా తల్లి

Published on Thu, 11/19/2026 - 19:34

Gurugram Mother Daughter Duo to Become Jain Nuns ఐఐఎం బెంగళూరు నుండి ఎంబీఏ. కార్పొరేట్‌ ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. విలాసవంత మైన జీవితం. ఏటా రూ. 50 లక్షల వేతనం, ఐఐఎం (IIM) బెంగళూరు నుంచి ఎంబీఏ (MBA) పట్టా, ఫియట్ (Fiat), మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz), వోక్స్‌వ్యాగన్ (Volkswagen) వంటి అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల్లో పనిచేసిన అనుభవం. కానీ ఇవేవీ 37 ఏళ్ల యువతికి సంతృప్తి నివ్వలేదు.  అందుకే  భిన్నమైన జీవితాన్ని ఎంచుకుంది. 61 ఏళ్ల శిరోమణి బజాజ్ కూడా తన వృత్తిపరమైన, భౌతిక జీవితాన్ని త్యజించి కుమార్తెతో పాటు అడుగులు వేయడం  విశేషం. జీవితంలో సంతృప్తికి ఒక్కొక్కరి నిర్వచనం ఒక్కోలా ఉంటుంది అనడానికి వీరి కథే నిదర్శనం. అసలేంజరిగింది తెలుసుకుందాం  ఈ కథనంలో...

కార్పొరేట్ కెరీర్ నుండి సన్యాసినిగా 
గురుగ్రామ్‌కు చెందిన 37 ఏళ్ల అక్షిత కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలిపెట్టి, జైన మతంలో 'సాధ్వి'గా మారాలని నిర్ణయించుకుంది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, ఆమె ఈ అడుగు ఒంటరిగా వేయడం లేదు. ఆమె తల్లి,  తన కుమార్తెతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు.

అక్షిత జైన్ ఎంతోకష్టపడి చదివి, వోక్స్‌వ్యాగన్ (Volkswagen) సంస్థలో ఏడాదికి సుమారు రూ. 50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించారు. కానీ కార్పొరేట్ కెరీర్‌లోని ఒత్తిళ్లు, సుఖభోగాలను వదులుకుని, ఆధ్యాత్మిక క్రమశిక్షణ, త్యాగంతో కూడిన జీవితాన్ని ఎంచుకోవాలని జైన్ భావించారు.  అందుకే 12 ఏళ్ల కార్పొరేట్ కెరీర్, వోక్స్‌వ్యాగన్‌లో గ్లోబల్ ఆపరేషన్స్ మేనేజర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకుంది.

అయితే కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఆమెకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల పర్యావరణంపై పడే ప్రభావం, భూమిని తవ్వడం వల్ల మట్టిలో నివసించే సూక్ష్మజీవులకు కలిగే హాని గురించి ఆమె ఆందోళన చెందారు.అన్ని జీవుల పట్ల అహింసను పాటించాలనే జైన సూత్రం, ఆమె ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడంలో కీలక పాత్ర పోషించింది.  మరోవైపు భర్త మరణం తర్వాత , కుటుంబ బాధ్యతలను పూర్తి చేసిన అనంతరం, జైన సాధ్వులతో పరిచయంనేపథ్యంతో ఆమెతల్లి ఆమె ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారు.

కుమార్తె బాటలోనే తల్లి శిరోమణి బజాజ్
తల్లి  శిరోమణి బజాజ్  కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో చీఫ్ మేనేజర్‌గా పనిచేసిన  ఆమె 37 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితం తర్వాత,  జైన సాధ్విగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ తల్లీకూతుళ్లు ఇప్పుడు తమ వృత్తిపరమైన జీవితాలను వదిలి, కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.  అక్షిత, శిరోమణిలు జైన ఆధ్యాత్మిక గురువు సాధ్వీ పూర్ణప్రజ్ఞశ్రీతో అనుబంధం కలిగి ఉన్నారు. సన్యాస స్వీకరణకు సిద్ధమవుతున్న క్రమంలో, శిరోమణి పలు మతపరమైన ఆచారాలను, కఠినమైన తపస్సులను  ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: గవర్నమెంట్‌ జాబ్‌ Vs టెంపరరీ జాబ్ : ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌

దీక్షా వేడుకల్లో భాగంగా, జోధ్‌పూర్‌లో 'వర్ఘోడ' సాంప్రదాయ జైన ఊరేగింపు నిర్వహించాల్సి ఉంది. దీని తర్వాత చెన్నైలో 'దీక్షా' కార్యక్రమం జరగనుంది. జైనమతంలో, దీక్ష అనేది సన్యాస జీవితంలోకి ప్రవేశించడానికి చేసే అధికారిక ప్రక్రియ. జైన మతంలో 'సాధ్వి'గా మారడం అంటే ప్రాపంచిక బంధాలను, సాధారణ జీవితపు అలవాట్లను పూర్తిగా వదిలిపెట్టి త్యాగం, కఠిన క్రమశిక్షణ, ఆధ్యాత్మిక సాధనతో కూడిన జీవితాన్ని ఎంచుకోవడం.

ఇదీ చదవండి: బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్‌ ఆఫర్‌

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)